IPL 2023: సచిన్‌ ఫేవరెట్‌ గ్రౌండ్‌లోనే తనయుడి అర్జున్‌ క్రికెట్‌ ఎంట్రీ.. ఎమోషనలైన మాస్టర్‌ బ్లాస్టర్‌

వాంఖడే స్టేడియంతో సచిన్‌కు ఎంతో అనుబంధం ఉంది. తన క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించి మధుర జ్ఞాపకాలున్నాయి. ఈ మైదానంలోనే సచిన్‌ తన 200వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. ప్రపంచకప్‌ను కూడా ఈ వేదిక మీదే అందుకున్నాడు. ఇలా సచిన్‌కు ఎన్నో మధురజ్ఞాపకాలను అందించిన వాంఖడేలోనే అతని కుమారుడు అర్జున్‌ అరంగేట్రం చేయడం విశేషం.

IPL 2023: సచిన్‌ ఫేవరెట్‌ గ్రౌండ్‌లోనే తనయుడి అర్జున్‌ క్రికెట్‌ ఎంట్రీ.. ఎమోషనలైన మాస్టర్‌ బ్లాస్టర్‌
Sachin Tendulkar, Arjun

Updated on: Apr 17, 2023 | 7:57 AM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ కుటుంబానికి ఆదివారం (ఏప్రిల్‌16) ఎంతో ప్రత్యేకమైన రోజు. అతని తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఎట్టకేలకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆదివారం కోల్‌కతా రైట్‌ నైడర్స్‌ మ్యాచ్‌తో ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు అర్జున్‌. అంతేకాదు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను కూడా అర్జునే వేయడం విశేషం. ఇక అర్జున్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సచిన్‌తో పాటు అంజలి, సారా హాజరయ్యారు. ముంబైలోని వాంఖడే స్టేడియంతో సచిన్‌కు ఎంతో అనుబంధం ఉంది. తన క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించి మధుర జ్ఞాపకాలున్నాయి. ఈ మైదానంలోనే సచిన్‌ తన 200వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. ప్రపంచకప్‌ను కూడా ఈ వేదిక మీదే అందుకున్నాడు. ఇలా సచిన్‌కు ఎన్నో మధురజ్ఞాపకాలను అందించిన వాంఖడేలోనే అతని కుమారుడు అర్జున్‌ అరంగేట్రం చేయడం విశేషం.

సచిన్‌ ఫేవరెట్‌ గ్రౌండ్‌లోనే..

కాగా ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అర్జున్‌ అద్వితీయ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తండ్రీ కొడుకుల జోడీ ఆడడం ఇదే తొలిసారి. సచిన్ టెండూల్కర్ గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆటగాడిగా, కెప్టెన్‌గా సేవలందించాడు. సచిన్ మొత్తం 78 మ్యాచ్‌ల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. సారథిగా 2013లో ముంబై ఇండియన్స్‌కు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు సచిన్‌. ఇది జరిగిన సుమారు 10 ఏళ్ల తర్వాత అర్జున్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈక్రమంలో తనయుడి ఐపీఎల్‌ ఎంట్రీపై భావోద్వేగానికి గురయ్యాడు సచిన్‌. సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

నీ కష్టాన్ని కొనసాగిస్తావని..

మ్యాచ్‌కు ముందు అర్జున్‌తో కలిసున్న ఫొటోలను షేర్‌ చేసిన సచిన్‌…’అర్జున్, ఈ రోజు నువ్వు క్రికెటర్‌గా నీ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేశావు. నీ తండ్రి మాదిరిగానే నీకు కూడా ఆటంటే ఎక్కువ ఇష్టం. క్రికెట్‌కు నవ్వు తగిన గౌరవాన్ని ఇస్తావు. ఇప్పుడు నీ ఆటే నిన్ను తిరిగి ప్రేమిస్తుందని నమ్ముతున్నా. నువ్వు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డావు. నువ్వు దానిని కొనసాగిస్తావని భావిస్తున్నా. ఇది ఒక అందమైన ప్రయాణానికి నాంది కావాలి. ఆల్ ది బెస్ట్’ అంటూ అర్జున్‌కు విషెస్‌ తెలిపాడు సచిన్‌.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..