- Telugu News Sports News Cricket news Ipl 2023 rcb player virat kohli completes 7000 ipl runs check kohli records
Virat Kohli: ఐపీఎల్‌లో పరుగుల వర్షం.. సరికొత్త రికార్డుల దిశగా కింగ్ కోహ్లీ..
IPL 2023: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్‌లో 7000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Updated on: May 08, 2023 | 9:10 PM

IPL 2023: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్‌లో 7000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అంతే కాకుండా లీగ్ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున 7000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డును కూడా లిఖించాడు. కింగ్ కోహ్లి 2008 నుంచి RCB తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు అదే జట్టు కోసం అనేక రికార్డులు నెలకొల్పిన ఘనతను కలిగి ఉన్నాడు.

దీంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌పై వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలు కేకేఆర్‌పై 1000 పరుగులు పూర్తి చేశారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోహ్లి వెయ్యి పరుగులు చేసి ప్రత్యేక ఫీట్ సాధించాడు.

ఆర్‌సీబీ తరపున అత్యధిక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు 49 అర్ధ సెంచరీలు, 5 సెంచరీలు చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధికంగా 50+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. కింగ్ కోహ్లీ ఐపీఎల్‌లో మొత్తం 55 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు చేశాడు.

దీంతో పాటు ఐపీఎల్‌లో 50 అర్ధశతకాలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ 59 అర్ధ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

225 ఐపీఎల్ ఇన్నింగ్స్ ద్వారా 7 వేల పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లి ఎన్నో రికార్డులను చేరుకోవడం విశేషం.




