కొత్త సీజన్.. కొత్త టీం.. అయిన మారలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫేట్. ఎప్పటిలానే మరోసారి చివరి బంతికి మ్యాచ్ చేజార్చుకుంది ఆర్సీబీ. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు చివరి బంతికి ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది రెండో ఓటమి. అప్పటిదాకా ఆనందంలో మునిగి తేలుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఓ ఫిమేల్ ఆర్సీబీ డై-హార్డ్ ఫ్యాన్ అయితే ఏకంగా బోరున ఏడ్చేసింది.
ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఒక్క ట్రోఫీ గెలవకపోయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ఆర్సీబీ ఓటమిపాలైంది. అంతే! అప్పటివరకు ఆనందంతో ఉన్న బెంగళూరు అభిమానుల్లో దుఃఖం పొంగుకొచ్చింది. ఓ ఫిమేల్ ఫ్యాన్ అయితే.. బాధను తట్టుకోలేక బోరున ఏడ్చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. కోహ్లి(61), డుప్లెసిస్(79), మ్యాక్స్‌వెల్(59) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత భారీ లక్ష్యచేదనలో బరిలోకి దిగిన లక్నోకు స్టోయినిస్(65), పూరన్(62), అయుష్ బదోని(30) అద్భుత విజయాన్ని అందించారు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఓటమితో ఆ జట్టు ఫ్యాన్స్ బోరున ఏడుస్తుంటే.. ముంబై ఫ్యాన్స్ మాత్రం తెగ సంతోషపడుతున్నారు. తమ కెప్టెన్‌ను తిట్టినందుకు.. తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Call me a bad guy but I m feeling Happy Seeing this crying. ?? Dil ko sukoon mila ?? Vintage haarcb. #IPL2023 #LSGvRCB pic.twitter.com/73x2eVrPQP
— Awarapan ?? (@KingSlayer_Rule) April 10, 2023