టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్-2023లో అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థుల పని పడుతున్నాడు. అదే సమయంలో బ్యాటింగ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు అశ్విన్. 178 పరుగుల లక్ష్య ఛేదనలో పింక్ ఆర్మీ విజయానికి చివరి10 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ సందర్భంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ తాను ఎదుర్కొన్న రెండు బంతులను ఫోర్, సిక్స్‌గా మలిచాడు. దీంతో తండ్రి బ్యాటింగ్ చూసి అశ్విన్ కూతురు ఆధ్యా తెగ సంబరపడిపోయింది. సంతోషంతో చప్పట్లు, కేరింతలు కొట్టింది. కానీ, మరుసటి బంతిని కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అశ్విన్ రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు పయనమయ్యాడు. అంతే అశ్విన్ అవుటైన మరుక్షణమే.. ఏడుపు అందుకుంది. తండ్రి ఔట్ అవ్వడం భరించలేకపోయిన చిన్నారి భోరున ఏడ్చేసింది. తల్లి ప్రీతి ఎంత సముదాయించినా వినలేదు. ప్రస్తుతం అశ్విన్ కూతురు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘నాన్నంటే ఆ చిన్నారికి ఎంత ప్రేమో కదా’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ 4 ఓవర్లలో 37 పరుగుల ఇచ్చి ఒక వికెట్ పడగొట్టలేకపోయాడు. అయితే కీలక సమయంలో బ్యాటింగ్‌లో దిగి రెండు బంతుల్లోనే 10 పరుగులు చేసి.. రాజస్థాన్‌ను గెలుపు బాట పట్టించాడు. ఇక ఐపీఎల్ తాజా సీజన్‌లోరాజస్థాన్ వరుస విజయాలతో దూసుకెలుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సంజూశామ్సన్ టీమ్ నాలుగింటిలో విజయం సాధించింది. మొత్తం 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. ఇక తర్వాతి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది రాజస్థాన్. బుధవారం లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
The boys are back! ??? pic.twitter.com/GMlPJpeU5R
— Rajasthan Royals (@rajasthanroyals) April 17, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..