పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుస పరాజయాలకు చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని సేనపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది పంజాబ్. చెన్నై విధించిన 201 పరుగుల టార్గెట్‌ను ఆఖరి బంతికి ఛేదించింది. మొదట్లో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ (42) అదరగొడితే.. లివింగ్ స్టోన్ (40), సామ్ కరన్ (29), శిఖర్ ధావన్ (28), జితేశ్ శర్మ (21) తలా కొన్ని పరుగులు జోడించి జట్టుకు విజయం చేకూర్చారు. మ్యాచ్ ఆఖరులో షారుఖ్ ఖాన్ (2 నాటౌట్), సికిందర్ రజా (13 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ సికందర్ రజా ఆఖరి బంతికి 3 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించాడు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా రెండు, మతీష పతిరణ ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా స్వస్థలంలో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోయిన డేవాన్ కాన్వేకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (92 నాటౌట్; 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ (37; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబె (28; 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా వేగంగా పరుగులు సాధించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, సామ్ కరన్, రాహుల్ చాహర్, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Kings Win ?#CSKvPBKS #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/tUoKRfmCos
— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2023
Kings will always be Kings ?❤️#CSKvPBKS pic.twitter.com/KkqUfeUGl7
— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..