Prithvi Shaw: సెల్ఫీ వివాదం తర్వాత తొలిసారి మౌనం వీడిన పృథ్వీ షా.. ఆసక్తికర పోస్ట్‌‌తో నెట్టింట హల్‌చల్..

|

Mar 10, 2023 | 8:43 AM

Pritvi Shaw Selfie Controversy: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్‌ చేశాడు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

Prithvi Shaw: సెల్ఫీ వివాదం తర్వాత తొలిసారి మౌనం వీడిన పృథ్వీ షా.. ఆసక్తికర పోస్ట్‌‌తో నెట్టింట హల్‌చల్..
Prithvi Shaw
Follow us on

Pritvi Shaw: భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు పృథ్వీ షాకు గత నెల రోజులుగా అంతా సవ్యంగా జరగడం లేదు. భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉండటంతో పాటు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత నెలలో ఓ సెల్ఫీ వివాదంతో వార్తల్లో నిలిచాడు. నివేదిక ప్రకారం, పృథ్వీ షా సోషల్ మీడియా క్రియోటర్ సప్నా గిల్, ఆమె స్నేహితులతో సెల్ఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో వివాదం మొదలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో సప్నా గిల్ పృథ్వీ షా తనను వేధించాడని ఆరోపించింది. పృథ్వీ షా ఈ మొత్తం విషయంలో ఇప్పటి వరకు మౌనం వహించాడు. అయితే, తాజాగా అతను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సందేశాన్ని రాసుకొచ్చాడు. అదే సెల్ఫీ వివాదానికి సంబంధించినది కావొచ్చని అంతా భావిస్తున్నారు.

పృథ్వీ షా మార్చి 9, గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాడు. అందులో “నీతో అవసరం ఉన్నంత వరకే కొంతమంది నిన్ను ప్రేమిస్తారు. ఆ తర్వాత నమ్మకం కూడా ముగిసిపోతుంది” అంటూ రాసుకొచ్చాడు. పృథ్వీ షా ఈ ఇన్‌స్టాగ్రామ్ కథనంలో మరేలాంటి సమాచారం అందించలేదు. అయితే, ఇది కచ్చితంగా టీమిండియా గురించే అంటున్నారు. భారత జట్టులో చోటు దక్కించుకోలేక వివాదంలో చిక్కుకోవడంతో ఈ ఓపెనర్ బ్యాట్స్‌మన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

చాలా నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం..

పృథ్వీ షా గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. అతను మే 2021లో శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్‌లో టీమిండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి పృథ్వీ షాకు ఆడే అవకాశం రాలేదు. అయితే ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పృథ్వీ షాను జట్టులో ఉంచినప్పటికీ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేకపోయాడు.

అయితే ఇటీవల పృథ్వీ షా తన ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ సౌరవ్ గంగూలీ, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ముందు ఈడెన్ గార్డెన్స్‌లో శిక్షణ సమయంలో పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఐపీఎల్ 2023లో అద్భుతంగా రాణించి టీమిండియాలోకి తిరిగి వస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..