IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో ప్లేఆఫ్ రేసు చాలా ఉత్కంఠభరితంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేఆఫ్ పరిస్థితి కాస్త క్లియర్‌గా మారింది. హైదరాబాద్‌పై విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. అదే సమయంలో హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్, సీఎస్‌కే, ఆర్‌సీబీలకు ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు మరింతగా పెరిగాయి.
ఇక CSK గురించి చెప్పాలంటే ధోనీ సేన ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. CSK తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించగలిగితే, ప్లేఆఫ్స్‌లో స్థానం ఖాయం అవుతుంది. చివరి మ్యాచ్‌లో ఓడిపోతే ప్లేఆఫ్ టిక్కెట్‌ను పొందడానికి CSK ఇతర జట్లపై ఆధారపడాల్సి రావచ్చు.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 14 పాయింట్లు సాధించింది. ముంబై ఇండియన్స్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్కటైనా ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఖాయం.
లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో కూడా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్ టికెట్ ఖాయం అవుతుంది. అయితే ఒక మ్యాచ్ గెలిస్తే, లక్నో ఇతర జట్లపై ఆధారపడవలసి ఉంటుంది.
RCB కూడా ప్లేఆఫ్ రేసులోనే ఉంది. RCB 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. RCB తన చివరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే, అది ప్లేఆఫ్ టిక్కెట్‌ను పొందడం ఖాయం. RCB ఒక మ్యాచ్‌లో ఓడిపోతే, ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశ కేవలం నెట్ రన్ రేట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
రాజస్థాన్ రాయల్స్ కేవలం 12 పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్ మాత్రం ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో లేవు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..