IPL 2023: ఆర్‌సీబీ ట్రోఫీ పట్టే వరకు పెళ్లి చేసుకోను.. వైరలవుతోన్న మహిళా అభిమాని పోస్టర్..

|

Apr 07, 2023 | 9:33 PM

ఆర్‌సీబీ ప్రతీ మ్యాచ్‌లో ఇలాంటి వారు కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2023లో ఇలాంటి ఓ అభిమాని సందడి చేసింది. మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఒక అమ్మాయి చేతిలో పోస్టర్‌తో నిల్చుంది.

IPL 2023: ఆర్‌సీబీ ట్రోఫీ పట్టే వరకు పెళ్లి చేసుకోను.. వైరలవుతోన్న మహిళా అభిమాని పోస్టర్..
Rcb Ipl 2023
Follow us on

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇంకా ఒక్క IPL టైటిల్ కూడా గెలవలేదు. కానీ, ఆ జట్టు అభిమానులు మాత్రం జట్టును ఎన్నడూ వీడలేదు. RCB అభిమానులను చాలా విశ్వాసకులుగా భావిస్తుంటారు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని RCBకి.. ప్రతిసారి కొత్త సీజన్‌లో అభిమానుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తూనే ఉంది. వీరిలో కొందరు అభిమానులు మాత్రం పీక్స్‌లో లవ్‌ను చూపిస్తుంటారు. RCB విజయం కోసం తమ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ప్రతిజ్ఞలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఇప్పటికే ఇలాంటి వారిని ఎంతోమందిని చూశాం. తాజాగా మరో అభిమాని నుంచి అలాంటి ఓ ప్రతిజ్ఞ వచ్చింది.

ఆర్‌సీబీ ప్రతీ మ్యాచ్‌లో ఇలాంటి వారు కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2023లో ఇలాంటి ఓ అభిమాని సందడి చేసింది. మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఒక అమ్మాయి చేతిలో పోస్టర్‌తో నిల్చుంది. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుచుకునే వరకు పెళ్లి చేసుకోనని ఆ పోస్టర్‌లో రాసి ఉంది. దీంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పాపం ఈమె కోసమైన ట్రోపీ గెలవండయ్యా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..