మహేంద్ర సింగ్ ధోని మరోసారి రెచ్చిపోయాడు. చెన్నై వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరులో బరిలోకి దిగిన మిస్టర్ కూల్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు. స్టార్ పేసర్ సామ్ కర్రన్ వేసిన బౌలింగ్‌లో ఆఖరి రెండు బంతులను నేరుగా స్టాండ్స్‌లోకి పంపిన అతను చెన్నై స్కోరును 200కు చేర్చాడు. మొత్తం 4 బంతులు ఎదుర్కొన్న ధోని 325కు పైగా స్ట్రైక్ రేట్‌తో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధోని దాటికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు సమర్పించుకున్నాడు సామ్ కర్రన్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (92 నాటౌట్, 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. రుతురాజ్ గైక్వాడ్ (37; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబె (28; 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, సామ్ కరన్, రాహుల్ చాహర్, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
కాగా గత నాలుగు మ్యాచ్‌ల్లో ధోనీ పెద్దగా ఆడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ధోనీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో ధోని ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురయ్యారు. అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆ కొరతను తీరుస్తూ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. భారీస్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (10 బంతుల్లో 21), ప్రభ్‌సిమ్రన్ సింగ్ ( 10 బంతుల్లో 26) వికెట్ కాపాడుకుంటూనే బౌండరీలు కొడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 3 ఓవర్లు ముగిసే సరికి 34/0.
Mass ??#CSKvPBKS #WhistlePodu #Yellove ??pic.twitter.com/F277rDd2hg
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2023
Every six has a story to tell, this year! ?✨#WhistlePodu #CSKvPBKS #Yellove ? @msdhoni pic.twitter.com/6RsjfTrlmy
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..