PBKS vs LSG Match Report: ఛేదనలో చిత్తుగా ఓడిన పంజాబ్.. 56 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం..
Punjab Kings vs Lucknow Super Giants: తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.
TATA IPL 2023 Punjab Kings vs Lucknow Super Giants Match Report: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో జట్టుకు ఇది 5వ విజయం. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.
లీగ్ చరిత్రలో లక్నో రెండో అత్యధిక స్కోరు సాధించింది. 2013లో బెంగళూరులో పూణె వారియర్స్‌పై RCB టీం 263 పరుగుల అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇదే అతిపెద్ద స్కోరుగా నిలిచింది. ఐపీఎల్‌లో 250+ పరుగులు చేయడం రెండోసారి.
ఇరు జట్ల ప్లేయింగ్ 11..
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జితేష్ శర్మ, షారూఖ్ ఖాన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మోహిత్ రాఠీ, రిషి ధావన్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ బ్రార్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సైమ్స్, ప్రేరక్ మన్కడ్, అమిత్ మిశ్రా, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..