IPL 2023, LSG vs MI: కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం.. మరింత రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్..

|

May 17, 2023 | 12:25 AM

IPL 2023, LSG vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్ చేజేతులా పోగోట్టుకున్నారు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోమ్‌ టీమ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను కాపాడుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్..

IPL 2023, LSG vs MI: కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం.. మరింత రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్..
Lsg Vs Mi
Follow us on

IPL 2023, LSG vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్ చేజేతులా పోగోట్టుకున్నారు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోమ్‌ టీమ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను కాపాడుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్టీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేశారు. లక్నో టీమ్‌కి సరైన శుభారంభం లభించక 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ కృనాల్ పాండ్యా(49, రిటైర్డ్ హర్ట్), మార్కస్ స్టోయినిస్(89, నాటౌట్) టీ స్కోర్‌ని 177 పరుగులకు చేర్చారు. ముంబై బౌలర్లలో బెహ్రాండర్ఫ్ 2, పియూష్ చావ్లా 1 వికెట్ తీసుకున్నారు.

అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్‌కి రోహిత్(37), ఇషాన్(59) ద్వయం శుభారంభాన్ని అందించింది. అయితే వీరిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత సూర్య కుమార్ యాదవ్(7), నేహల్ వధేరా(16) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ 32 పరుగులతో అజేయంగా రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ రెండేసి వికట్లు పడగొట్టగా.. మోహ్సిన్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ముంబై ఇండియన్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ అవకాశం కోసం పోటీ మరింత రసవత్తరంగా మారింది. నేటి విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఇక లక్నో, ముంబై జట్లకు చెరో మ్యాచ్ మిగిలి ఉంది. లక్నో తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే తప్పక ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. కానీ ముంబై పరిస్థితి అలా లేదు. ఎందుకంటే రోహిత్ సేన తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మీద భారీ తేడాతో విజయం సాధించడమే కాక.. ఇతర మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ముంబై టీమ్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే.. బెంగళూర్, లక్నో, చెన్నై, పంజాబ్ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో తప్పక ఓడిపోవాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..