Indian Premier League 2023: ఏప్రిల్ 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో, రెండు జట్ల నుంచి అద్భుతమైన బ్యాటింగ్ కనిపించింది. ఈ మ్యాచ్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఓ యువ అభిమాని పోస్టర్ సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది. అందులో అతను విరాట్ కోహ్లీ కుమార్తె వామికతో డేటింగ్ గురించి ప్రస్తావించాడు.
ఈ యువ అభిమాని పోస్టర్‌ను పట్టుకుని, అందులో ‘హై, విరాట్ అంకుల్.. నేను వామికను డేట్‌కి తీసుకెళ్లవచ్చా.? అంటూ ఓ చిన్నారి చేతిలో పోస్టర్‌తో హల్ చల్ చేశాడు. ఈ పోస్టర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల్లో ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. చిన్నారి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.. వారి ప్రవర్తనను కూడా ఖండించారు.
ఈ పోస్టర్‌తో కనిపించిన పిల్లాడిని చూస్తే అందులో రాసుకున్న మాటలకు పూర్తి అర్థం తెలియకపోవచ్చని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలిచ్చారు.
Disgusting ? pic.twitter.com/jmPYhDGGg3
— Sanjay Kishore (@saintkishore) April 18, 2023
It’s not at all funny
Absolutely cheap
N the poor kid doesn’t even know what it means
His parents shld be ashamed to use him https://t.co/tdrpxTZGp3— With_the_winds (@Sakhi_0_Sakhi) April 18, 2023
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, RCB జట్టు 227 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడింది. 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
This lil kid wanna take Virat Kohli’s daughter, Vamika on a date.
Common Kid .. Choose a better girl ? pic.twitter.com/QjSsn0OBLe
— ???????? (@Hydrogen_45) April 17, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..