IPL 2023 Final: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో ఫైనల్ మ్యాచ్‌ని రిజర్వ్‌డేకు షిఫ్ట్ చేయాలని అంపైర్లు ర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ జరగకుండా వరుణ దేవుడు అడ్డుపడడంతో ఫైనల్ పోరు చూడడానికి వచ్చి ఎంతో నిరీక్షించిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ లేడీ ఫ్యాన్.. స్టేడియంలో డ్యూటీ చేస్తున్న ఓ పోలీస్ అధికారిపై చేజేసుకుంది. ఆ లేడీ ఫ్యాన్ నెట్టడంతో కిందపడిన సదరు పోలీస్ అధికారి లేచి అక్కడ నుంచి వెళ్తున్నా కూడా.. పదే పదే నెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను షూట్ చేసిన కొందరు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
This woman slapped and hit this male officer like anything and the helpless guy couldn’t do anything. Is this woman empowerment? pic.twitter.com/m4sMZg0Lds
ఇవి కూడా చదవండి— ∆ (@TheNaziLad) May 28, 2023
అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందో తెలియరాలేదు కానీ వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కొందరు సదరు పోలీస్ అధికారి తాగి ఆ లేడీ ఫ్యాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే ఆమె దేహ శుద్ది చేసిందంటున్నారు. ఇంకొందరు ఆ లేడీ ఫ్యాన్ రౌడీలా ప్రవర్తించిందని, ఏ తప్పు లేకపోయినా అనవసరంగా పోలీస్ అధికారిపై చేయి చేసుకుందని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోలీస్ వ్యవస్థపై ఇలాంటి అఘాయిత్యాలు పదేపదే జరిగే ప్రమాదం ఉందని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఇదేనా అంటూ మండిపడుతున్నారు. విచారకరం ఏమిటంటే.. సదరు లేడీ ఫ్యాన్ తమ ముందే ఇంతగా వీరంగం చేస్తున్నా.. ఆమెను ఆపేందుకు లేదా పోలీస్ అధికారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..