IPL 2023 Final GT vs CSK: రిజర్వ్ డేన మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. వర్షం పడితే విజేతను ఎలా డిసైడ్ చేస్తారంటే..

|

May 29, 2023 | 3:47 PM

IPL 2023 Final: ఇప్పుడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య టైటిల్ పోరు జరుగుతోంది. మళ్లీ వర్షం పడితే ఎలా ఉంటుందనేది ప్రశ్నగా మారింది.

IPL 2023 Final GT vs CSK: రిజర్వ్ డేన మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. వర్షం పడితే విజేతను ఎలా డిసైడ్ చేస్తారంటే..
Ipl 2023 Final Gt Vs Csk
Follow us on

IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు IPL 2023 ఛాంపియన్‌గా అవతరించడానికి రిజర్వ్ డే అంటే సోమవారం నాడు హార్దిక్ పాండ్యా వర్సెస్ ఎంఎస్ ధోని మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరును చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆదివారం అహ్మదాబాద్‌లో కురిసిన భారీ వర్షం టాస్‌కు కూడా అవకాశం ఇవ్వలేదు. అభిమానులు బాధతో ఇంటికి తిరిగి వచ్చారు.

ఇప్పుడు రెండు జట్లు మ్యాచ్ కోసం సోమవారం మళ్లీ మైదానానికి తిరిగి రానున్నాయి. స్టేడియం మళ్లీ ప్రేక్షకులతో నిండిపోయింది. రిజర్వ్ రోజున మళ్లీ అదే ఉత్సాహం కనిపిస్తుందేమో కానీ.. ఈ ఉత్సాహం మధ్య మళ్లీ వాతావరణం భయం పట్టుకుంది. రిజర్వ్ డే రోజున ఈ భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షం కారణంగా సోమవారం కూడా ఫైనల్ జరగకపోతే, మరో రిజర్వ్ డే లేదు. ఈ రోజు ఛాంపియన్ ఏ సందర్భంలోనైనా నిర్ణయించేస్తారు. వర్షం వచ్చినా ఫలితం కోసం అన్ని విధాలా కృషి చేస్తామంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈరోజు కూడా వర్షం పడితే ఫైనల్ ఎలా, ఎప్పుడు మొదలవుతుందో 5 పాయింట్లలో తెలుసుకుందాం..

  1. రిజర్వ్ డేలో టాస్ సమయం రాత్రి 7 గంటలకు పడనుంది. మొదటి బంతి రాత్రి 7.30 గంటలకు వేయనున్నారు.
  2. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోతే రాత్రి 9.35 గంటల వరకు ఆగాల్సిందే. మ్యాచ్ 9.35కి ప్రారంభమైతే పూర్తి 20 ఓవర్ చొప్పున గేమ్ జరుగుతుంది.
  3. రాత్రి 9.35 వరకు కూడా మ్యాచ్ ప్రారంభం కాకపోతే, తెల్లవారుజామున 12.06 తర్వాత ఫలితం కోసం 5 ఓవర్ల చొప్పున ఆడేందుకు ప్రయత్నిస్తారు.
  4. వర్షం కారణంగా ఉదయం 12.06 గంటలకు కూడా మ్యాచ్ ప్రారంభం కాకపోతే.. ఫలితం కోసం సూపర్ ఓవర్ వరకు ఆడే ప్రయత్నం చేస్తారు.
  5. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే, ఇటువంటి పరిస్థితిలో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..