IPL 2023 Final: ‘ముంబైతో ఫైనల్ ఆడాలని లేదు, నాకు భయం’.. వైరల్ అవుతున్న ధోని సేన మాజీ ప్లేయర్ మాటలు..

|

May 25, 2023 | 2:44 PM

IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ పాటికే తొలి క్వాలిఫైయర్స్‌లో గుజరాత్‌ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్..

IPL 2023 Final: ‘ముంబైతో ఫైనల్ ఆడాలని లేదు, నాకు భయం’.. వైరల్ అవుతున్న ధోని సేన మాజీ ప్లేయర్ మాటలు..
Dwayne Bravo On Possible Csk Vs Mi Ipl 2023 Final
Follow us on

IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ పాటికే తొలి క్వాలిఫైయర్స్‌లో గుజరాత్‌ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించి క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది. ఇక రేపు అంటే మే 26న అహ్మదాబాద్‌లోనే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే ఆ మ్యాచ్‌లో గుజరాత్‌పై ముంబై టీమ్ గెలిస్తే.. మరోసారి ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్‌లో ముంబైతో తలపడాలనే కోరిక మాకు పూర్తిగా లేదని చెన్నై మాజీ క్రికెటర్ ఒకరు చెప్పాడు.

అవును, ఐపీఎల్ తొలినాళ్ల(3 సీజన్లు)లో ముంబై ఇండియన్స్ తరఫున.. అలాగే లీగ్ చరిత్రలో ఎక్కువ కాలం చెన్నై టీమ్(10 సీజన్లు) తరఫున ఆడిన డ్వేన్ బ్రావో ఈ మాటలు అన్నాడు. ఇక దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బ్రావో మాట్లాడుతూ ‘ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడడం నాకు ఇష్టం లేదు. నా స్నేహితుడు కీరన్ పొలార్డ్‌కి కూడా దాని గురించి తెలుసు. కానీ అన్ని టీమ్‌లకు నా నుంచి ఆల్ ది బెస్ట్. ఫైనల్‌లోకి ఎవరు నిలుస్తారు..? అదే మా ఫోకస్‌’ అని అన్నాడు.

ఇవి కూడా చదవండి


కాగా, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాయి. మరోవైపు ముంబై, చెన్నై జట్లు ఇప్పటి వరకు 4 సార్లు ఐపీఎల్ ఫైనల్స్‌లో తలపడగా.. అందులో ముంబై ఇండియన్స్ జట్టు 3 సార్లు గెలుపొందగా, చెన్నై జట్టు ఒక్కసారి మాత్రమే మ్యాచ్ గెలిచింది. చెన్నై జట్టు 2010లో ముంబైని ఓడించి టైటిల్ గెలుచుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ 2013, 2015, 2019 ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఆడితే తమకు అందే ట్రోఫీ కూడా చేజారుతుందేమోనని బ్రావో అనుకుంటున్నాడేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..