MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎంఎస్ ధోని జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులకు వీడ్కోలు చెప్పేందుకు మైదానం చుట్టూ తిరుగుతూ బై బై చెప్పేశారు. నిజానికి చెపాక్ స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. చెపాక్ స్టేడియం చాలా ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు హోమ్ గ్రౌండ్. ధోనీ టీమ్‌కు ఇక్కడి అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఓ ఇంటర్వ్యూలో ధోనీ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఆడాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఆడిన ధోనీకి కొంతమంది అభిమానులు చెపాక్ స్టేడియం రూపంతో చిన్న ఫొటోను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధోనీతోపాటు ఆ అభిమాని కలిసి ఉన్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ధోనీకి ఎంఏ చిదంబరం స్టేడియం అంటే చెపాక్ స్టేడియం నమూనాను అందించారు. ఈ బహుమతి చూసి ధోనీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A fan gifts #MSDhoni? miniature of #ChepaukStadium #ChennaiSuperKings pic.twitter.com/wabqOiomMS
— Prof Dr Shibu A (@shibu_prof) May 19, 2023
ఐపీఎల్‌లో చెన్నై ఆటతీరును పరిశీలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్‌కు టిక్కెట్ దక్కలేదు. గురువారం విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం చెన్నై, లక్నో జట్లకు అనివార్యంగా మారింది.
Fans gifted a miniature of Chepauk Stadium to MS Dhoni. pic.twitter.com/VIwO5LW96Z
— Johns. (@CricCrazyJohns) May 17, 2023
చెన్నై, లక్నో జట్లకు 15 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు ఇప్పుడు 14 పాయింట్లతో ఉంది. ముంబైకి కూడా 14 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు 12 పాయింట్లు ఉన్నాయి. తద్వారా శుక్రవారం జరిగే లీగ్ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 14 పాయింట్లు అందుకోవచ్చు. దీంతో నెట్ రన్ రేట్ కూడా ప్లస్ అవుతుంది. అయితే, బెంగళూరు, చెన్నై, లక్నో తమ మిగిలిన చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే, ప్లే-ఆఫ్స్‌కు నేరుగా టిక్కెట్ పొందే ఛాన్స్ ఉంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు దూరమవుతుంది.
A fan gifts a miniature of chepauk stadium to MS Dhoni ??@MSDhoni #IPL2O23 #WhistlePodu pic.twitter.com/U9RgTs0vUh
— DHONI Era™ ? (@TheDhoniEra) May 17, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..