
ఊరు మారినా ధోని క్రేజ్ మాత్రం మారడం లేదు. చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో, ఢిల్లీ.. ప్లేస్ ఏదైనా మిస్టర్ కూల్ ఫీవర్ ఏ మాత్రం తగ్గడం లేదు. అదే జనం.. అదే అభిమానం. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనిపై అంతులేని అభిమానం చూపిస్తున్నారు ఫ్యాన్స్. గతంలో కేవలం చెన్నైలోనే ధోని ఫీవర్ పీక్స్‌లో ఉండేది. కానీ ఇప్పుడు స్టేడియం ఏదైనా ‘ధోని.. ధోని’ అంటూ నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నై సారథిని చూసేందుకు ఢిల్లీ వాసులు పోటెత్తారు. శనివారం (మే20) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బస్సులో ఎంఎస్ ధోని ఉండడమే. సీఎస్‌కే జెర్సీలు ధరించిన అభిమానులు స్టేడియానికి వెళ్లే దారి పొడవునా మోహరించారు. ధోనిని చూడడం కోసం బస్సును చుట్టుముట్టారు. కొందరైతే కార్ల బానెట్లపై నిలబడి మరీ తమ అభిమాన ఆటగాడిని చూడాలని తపించారు. ఒకానొక దశలో వేలాది మంది రావడంతో ధోని ప్రయానిస్తున్న బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమణగడంతో బస్సుకు దారి దొరికింది.
ఢిల్లీ వీధుల్లో ధోని క్రేజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు ‘ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మ’ అంటూ సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. ‘ ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. ఆకాశమంత అభిమానం అంటే ఇదేనేమో’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సీఎస్‌కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘ఒక్కడి కోసం రాజధాని నగరం జనసంద్రమైంది. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. . ప్రస్తుతం సీఎస్‌కే 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Fans behind the CSK bus in Delhi.
This is madness. pic.twitter.com/P594b5r8QL
— Johns. (@CricCrazyJohns) May 20, 2023
Thaana Serndha Kootam at ThalaiNagaram! ?#DCvCSK #WhistlePodu #Yellove ? pic.twitter.com/LrgHw3SQYM
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..