IPL 2023: ‘ధోని రివ్యూ సిస్టమ్’.. ఐపీఎల్ 16వ సీజన్‌లో ‘డీఆర్ఎస్’ సక్సెస్ రేట్ ఎంతంటే..?

|

Apr 24, 2023 | 12:22 PM

Dhoni Review System: క్రికెట్ పరిభాషలో డీఆర్‌ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రికెట్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం నచ్చకపోతే రివ్యూ తీసుకోవడం. అయితే క్రికెట్ అభిమానులకు మాత్రం డీఆర్ఎస్ అంటే ‘ధోనీ రివ్యూ సిస్టమ్’. అంపైర్‌ ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా..

IPL 2023: ‘ధోని రివ్యూ సిస్టమ్’.. ఐపీఎల్ 16వ సీజన్‌లో ‘డీఆర్ఎస్’ సక్సెస్ రేట్ ఎంతంటే..?
Dhoni Review System
Follow us on

Dhoni Review System: క్రికెట్ పరిభాషలో డీఆర్‌ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రికెట్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం నచ్చకపోతే రివ్యూ తీసుకోవడం. అయితే క్రికెట్ అభిమానులకు మాత్రం డీఆర్ఎస్ అంటే ‘ధోనీ రివ్యూ సిస్టమ్’. అంపైర్‌ ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా ధోనీ డీఆర్‌ఎస్ కోరాడంటే.. ఫీల్డ్‌ అంపైర్ తన నిర్ణయం దాదాపుగా మార్చుకోవాలసిందే. డీఆర్‌ఎస్ విషయంలో లేదా ఆటను గమనించడంలో అంత ఖచ్చితంగా ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ‌ టీమ్‌ని అన్ని విభాగాల్లో అద్భుతంగా నడిపిస్తున్న ధోని ‘డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్’ అని మరోసారి నిరూపించాడు. అంతేకాక ఐపీఎల్ 16వ సీజన్‌లో ధోని ‘డీఆర్ఎస్’ సక్సెస్‌రేట్ ఏకంగా 85.71 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ధోని సేన ఇచ్చిన 236 పరుగులు లక్ష్యాన్ని చేధించడానికి కోల్‌కతా బ్యాటింగ్ చేస్తోంది. ఆ సమయంలో తుషార్‌ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్ 3వ బంతిని డేవిస్ విసే ఆడాడు. అయితే బంతి బ్యాట్‌కి కనెక్ట్ కాకుండా విసే లెగ్స్‌కి తగిలింది. దీనికి సీఎస్‌కే ఆటగాళ్లు ‘ఔట్ ఔట్’ అంటున్నా కూడా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అంతే.. ధోని వెంటనే డీఆర్ఎస్ అడిగాడు. ఇక సమీక్షలో బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టమైంది. దీంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని డేవిడ్ విసేని ఔట్‌గా ప్రకటించాడు.

ఇలా మరోసారి సోషల్‌ మీడియాలో ‘ధోనీ రివ్యూ సిస్టమ్‌’ వైరల్‌గా మారింది. ‘డీఆర్‌ఎస్‌’ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ధోనికి తిరుగులేదని చెప్పడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఖచ్చితత్వంతో డీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ని వాడుకొన్న కెప్టెన్‌గా ధోనీ ఇప్పటికే ఘనత సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..