DC Vs GT: అప్పుడు వేస్ట్ అని పక్కనపెట్టారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అదే జట్టుకు హీరో అయ్యాడు..

మంగళవారం ఐపీఎల్ 2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ సులువుగా గెలుస్తుందని అనిపించినా,

DC Vs GT: అప్పుడు వేస్ట్ అని పక్కనపెట్టారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అదే జట్టుకు హీరో అయ్యాడు..
Delhi Capitals
Follow us
Ravi Kiran

|

Updated on: May 03, 2023 | 10:55 AM

మొన్న పీయూష్ చావ్లా.. నిన్న మోహిత్ శర్మ.. నేడు ఇషాంత్ శర్మ.. ఇలా టీమిండియా వెటరన్ ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ 2023లో అద్భుతమైన కంబ్యాక్ ఇస్తున్నారు. మంగళవారం ఐపీఎల్ 2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ సులువుగా గెలుస్తుందని అనిపించినా, చివరి ఓవర్‌లో ఇషాంత్ గుజరాత్‌ను 12 పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాదు.. తన జట్టు ఐదు పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పెద్దగా స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు ఈ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యచేధనలో గుజరాత్ కూడా తడబడింది. కానీ చివరికి టైటాన్స్ గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో.. లాస్ట్ ఓవర్ ఇషాంత్ శర్మ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు విజయం దక్కకుండా అడ్డుకున్నాడు. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది.

ఫినిషర్లను కట్టడి..

చివరి రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 33 పరుగులు కావాల్సి ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో ఒక పక్కన, ఆ జట్టు ఫినిషర్ రాహుల్ టేవాటియా మరో ఎండ్‌లో ఉన్నారు. ఇక టేవాటియా తనదైన శైలిలో 19వ ఓవర్లో నోర్తజా బౌలింగ్‌లో మూడు వరుస సిక్సర్లు బాదాడు. దీంతో చివరి ఓవర్‌లో గుజరాత్‌కు 12 పరుగులు కావాల్సి వచ్చింది. ఫైనల్ ఓవర్ ఇషాంత్ చేతికి ఇచ్చాడు ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్. టేవాటియా, పాండ్యా లాంటి తుఫాను బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశాడు ఇషాంత్. మొదటి బంతికి రెండు పరుగులు ఇవ్వగా.. తర్వాతి బంతికి సింగిల్. మూడో బంతిని డాట్ బాల్‌గా వేశాడు ఈ టీమిండియా వెటరన్. ఇక నాలుగో బంతికి టేవాటియాను ఔట్ చేశాడు. అప్పుడు రషీద్ ఖాన్ బరిలోకి దిగాడు. అతడు కూడా సిక్సర్లు కొట్టడంలో దిట్ట. అయితేనేం ఐదో బంతికి రషీద్ రెండు పరుగులు, చివరి బంతికి ఒక్క పరుగు ఇచ్చి.. రషీద్‌ను కట్టడి చేయడమే కాదు.. ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు ఇషాంత్ శర్మ.

విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్..

అంతకుముందు ఇషాంత్ తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇషాంత్ వేసిన చక్కనైన నకల్ బాల్‌కి విజయ్ శంకర్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాంత్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అటు ఈ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఇషాంత్‌కు ఢిల్లీ అవకాశం ఇవ్వలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన ఇషాంత్, తన పేరిట రెండు వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్ తీయడంలో సఫలమయ్యాడు. ఆ తర్వాత గుజరాత్‌పై కూడా అవకాశం దక్కించుకుని జట్టును గెలిపించాడు.