IPL 2023: ఫీల్డ్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ దుమ్మురేపిన ధోనీసేన.. ఆ విషయంలో అగ్రస్థానం..

|

May 16, 2023 | 8:53 PM

Chennai Super Kings: మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

IPL 2023: ఫీల్డ్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ దుమ్మురేపిన ధోనీసేన.. ఆ విషయంలో అగ్రస్థానం..
Csk Team
Follow us on

Mahendra Singh Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కంటే ముంబై ఇండియన్స్ మాత్రమే ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసింద. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న పాపులారిటీ మరే జట్టుకు కూడా కనిపించదు. చెన్నై సూపర్ కింగ్స్‌పై అభిమానుల్లో అమేజింగ్ క్రేజ్ కనిపిస్తోంది.

ట్విటర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆసియా జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్..

తాజాగా డిపోర్టెస్ & ఫైనాన్జాస్ నుంచి ఒక నివేదిక వచ్చింది. ఈ నివేదిక ప్రకారం, మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆసియా జట్టుగా తేలింది. అంటే ట్విట్టర్‌లో మహేంద్ర సింగ్ ధోని టీమ్‌ని ఇష్టపడే అభిమానుల సంఖ్య అత్యధికంగా ఉందన్నమాట. ఈ లెక్కన ఏప్రిల్ నెలకు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉందంట. అదే సమయంలో, IPL 2023 సీజన్ ఈ జట్టుకు సానుకూలంగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ ఉందంటే?

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్ +0.381గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..