చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎంఎస్ ధోని జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లందరూ మైదానం చుట్టూ కలియ తిరిగారు. నిజానికి చెపాక్ స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ధోనీ అండ్‌కోకు ఇక్కడి అభిమానుల నుంచి చాలా మద్దతు లభిస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో ఆడాలనుకుంటున్నాను అంటూ ధోని చెప్పిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలా చెపాక్ స్టేడియంతో ఎంతో అనుబంధమున్న ధోనికి చెన్నై అభిమానులు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది చూసి ధోని కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ చెన్నై ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? చెపాక్ స్టేడియంతో రూపంలో ఉన్న ఓ మినీయేచర్‌ను ధోనికి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసి ధోనితో పాటు అతని అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇక ఐపీఎల్‌లో చెన్నై ఆటతీరును పరిశీలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. గురువారం విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో విజయం చెన్నై, లక్నో జట్లకు అనివార్యం. ప్రస్తుతం చెన్నై, లక్నో జట్లకు 15 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు, ముంబై జట్ల ఖాతాలో కూడా 14 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు 14 పాయింట్లు ఉన్నాయి. అయితే బెంగళూరు, చెన్నై, లక్నో తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిస్తే నేరుగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకోవచ్చ. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.
A fan gifts #MSDhoni? miniature of #ChepaukStadium #ChennaiSuperKings pic.twitter.com/wabqOiomMS
— Prof Dr Shibu A (@shibu_prof) May 19, 2023
Fans gifted a miniature of Chepauk Stadium to MS Dhoni. pic.twitter.com/VIwO5LW96Z
— Johns. (@CricCrazyJohns) May 17, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..