IPL 2023 Final Ticket: మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. కాగా ఫైనల్ ఆడే మరో జట్టు ఏదనేది నేడు తేలనుంది. వాస్తవానికి, క్వాలిఫయర్-2 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. ఫైనల్‌కు చేరేందుకు ఇరు జట్లు మే 26న ముఖాముఖి తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం గందరగోళం జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. అలాగే టిక్కెట్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో టిక్కెట్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఐపీఎల్ ఫైనల్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Total mismanagement in Ahmedabad for the tickets of IPL 2023 Qualifier 2 and the Final.
Fans surely deserve better than this. pic.twitter.com/1T86QjhbsI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2023
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్‌ను 81 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ తరపున, కామెరాన్ గ్రీన్ 23 బంతుల్లో అత్యధికంగా 41 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ 182 పరుగులకు సమాధానంగా లక్నో సూపర్ జెయింట్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ తరపున ఆకాశ్ మధ్వల్ 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..