Indian Premier League 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం లేదు. ఇప్పటి నుంచే అభిమానుల్లో సందడి మొదలైంది. ఇదిలా ఉంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీజన్ ప్రారంభానికి ముందే అన్ని ఫ్రాంచైజీలకు భారీ షాక్ ఇచ్చింది. దీనిలో కాంట్రాక్టు పొందిన భారత బౌలర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో ఎక్కువ బౌలింగ్ చేయకూడదని ఆదేశించింది.
IPL 2023 సీజన్ ముగిసిన తర్వాత, భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కు బయలుదేరాలి. ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్ల పూర్తి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఈ సూచనను జారీ చేసింది.
నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లోని ఫిజియో నితిన్ పటేల్, భారత జట్టు కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్, జూమ్ మీటింగ్ ద్వారా భారత బౌలర్లకు సంబంధించిన ఈ సూచనల గురించి అన్ని ఫ్రాంచైజీల శిక్షకులు, ఫిజియోథెరపిస్టులకు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్లు ఇప్పటికే షార్ట్‌లిస్ట్ అయ్యారు. వారి పనిభారానికి సంబంధించి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా వీరు IPL సమయంలో ఎటువంటి తీవ్రమైన గాయాన్ని చవిచూడకూడదని బీసీసీఐ భావిస్తోంది.
ఈ సూచనలకు సంబంధించి, ఫ్రాంచైజీలకు సంబంధించి ఇప్పటికే ప్రతిదీ వివరించామని భారత బోర్డు అధికారి తన ప్రకటనలో తెలిపారు. భారత బౌలర్లకు శిక్షణ, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..