ఈసారైనా ఐపీఎల్ కప్పు కొట్టాలన్న కసితో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి సీజన్ నుంచి ఆడుతున్నా ఆ జట్టుకు టైటిల్ మాత్రం అందని ద్రాక్షలాగే ఉంది. స్టార్ ఆటగాళ్లకు కొదవలేకపోయినా కప్పు నెగ్గడంలో మాత్రం ఆ జట్టు ప్రతిసారీ విఫలమవుతోంది. కాగా రాబోయే సీజన్‌లోనైనా టైటిల్ కరువును తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. ఇందులో భాగంగానే కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో విల్ జాక్స్ లాంటి దూకుడైన ఆటగాడిని తీసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.3.2 కోట్ల వెచ్చించింది. ఇంగ్లండ్‌కు చెందిన ఈ ఎమర్జింగ్ ప్లేయర్‌కు టీ20లో అనుభవం బాగానే ఉంది. ముఖ్యంగా 2019లో, దుబాయ్‌లో ప్రీ-సీజన్ T10 మ్యాచ్‌లో సర్రే తరపున ఆడుతున్నప్పుడు జాక్స్ లాంక్‌షైర్‌పై తుఫాను బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే మ్యాచ్‌లో సెంచరీ కూడా చేశాడు. అది కూడా కేవలం 25 బంతుల్లోనే. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా విల్ జాక్స్ పేరు మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 30 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. విల్ సెంచరీ కారణంగా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సర్రే 176 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు 9 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కాగా జాక్స్ కొన్ని నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. మొత్తం 2 టీ20 మ్యాచ్‌ల్లో 40 పరుగులు చేశాడు. భారత్‌పై కూడా జాక్వెస్ పరుగులు సాధించాడు. 2017లో భారత్‌తో జరిగిన అండర్-19 టెస్టులో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 2018లో అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లీష్ జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. ఆ టోర్నీలోనూ కెనడాపై 102 పరుగులు చేసి మరోమారు అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. 24 ఏళ్ల జాక్స్ బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుతాలు చేయగలడు. ఇటీవల రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్‌లో ఏ మేర సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Joining RCB’s #ClassOf2023:
Name: Will Jacks
Price: 320LWelcome to the RCB family! ❤️#PlayBold #WeAreChallengers #IPL2023 #IPL2023Auction pic.twitter.com/gsqumWPITW
— Royal Challengers Bangalore (@RCBTweets) December 23, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..