ఐపీఎల్ 2022లో వరుస ఓటములను చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) బలం పుంజుకునేందుకు మార్గం కనుక్కోవాలని అన్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 54 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జడేజా ఓపెనర్ రుతురాజ్‌గైక్వాడ్(Ruturaj Gaikwad) ఫామ్‌పై స్పందించాడు. అతనికి ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నాడు. ” మేము పవర్ ప్లే చాలా వికెట్ల్ కోల్పోయాం. తొలి బంతి నుంచే పరుగులు సాధించడంలో వెనకపడ్డాం. బలం పుంజుకోవడానికి దారి కనుక్కోవాలని” జడేజా చెప్పాడు. అలాగే శివం దూబేపై జడేజా ప్రశంసలు కురించాడు. దూబే వరుసగా అర్థ సెంచరీలు చేశాడని… దూబే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని అన్నాడు. మేము తిరిగి పుంజుకోవడానికి కృషి చేస్తామని చెప్పాడు.
అటూ పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన సహచరులను ప్రశంసించారు.” లివింగ్‌స్టోన్‌తో నేను ఏమీ మాట్లాడలేదు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు” అని అగర్వాల్ చెప్పాడు. 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన వైభవ్ అరోరాపై కూడా మయాంక్ ప్రశంసలు కురిపించాడు. “వైభవ్ కొన్ని సంవత్సరాల క్రితం మాతో ఉన్నాడు. మేము ప్రతిభను చూశాము. జితేష్ శర్మను తీసుకోవడానికి అనిల్ కుంబ్లే కన్ను కారణమని అగర్వాల్ పేర్కొన్నాడు. “జితేష్‌తో, అనిల్ భాయ్ అతనిని ముంబై ఇండియన్స్‌లో చూశాడు. అతను అద్భుతమైన కీపర్. అతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం అతని వైఖరి.” అని అగర్వాల్ అన్నాడు.
పంజాబ్ కింగ్స్ అత్యంత ఖరీదైన ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు.” నేను కష్టపడి స్వింగ్ చేస్తున్నాను.” అని లివింగ్‌స్టోన్ అన్నాడు. “బౌలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఓడియన్ స్మిత్‌తో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తాను” అని అతను చెప్పాడు.
Read Also..IPL 2022: ‘పంజాబీ-పంజాబీ’ అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో పాట పడిన పంజాబ్ ఆటగాళ్లు.. వైరల్ అయిన వీడియో..