Watch Video: ‘అరబిక్ కుతు’ పాటకు స్టెప్పులేసిన టీమిండియా ప్లేయర్లు.. వేరే లెవల్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో

సౌత్ సూపర్ స్టార్ విజయ్ రాబోయే చిత్రం 'బీస్ట్' సినిమాలోని పాటకు టీమిండియా యువ ప్లేయర్లు చిందులేశారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పాటపై ఫిదా కాగా, తాజాగా వీరు కూడా ఈ లిస్టులో చేరిపోయారు.

Watch Video: అరబిక్ కుతు పాటకు స్టెప్పులేసిన టీమిండియా ప్లేయర్లు.. వేరే లెవల్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో
Ipl 2022 Venkatesh Iyer And Avesh Khan Dance

Updated on: Mar 19, 2022 | 10:46 AM

టీమిండియా(Team India) యువ స్టార్ ప్లేయర్లు వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer), అవేష్ ఖాన్‌ల(Avesh Khan)కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ఈ ఇద్దరు ఆటగాళ్లు ‘అరబిక్ కుతు హబీబో’ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ విజయ్ రాబోయే చిత్రం ‘బీస్ట్’ సినిమాలోని పాటకు చిందులేశారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పాటపై చాలా వీడియోలు చేశారు. తాజాగా వీరు కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఈ వీడియోలో, అయ్యర్, అవేష్ ఇద్దరూ హుక్ స్టెప్‌పై డ్యాన్స్ చేస్తున్నారు. మొదటి టేక్‌లోనే నాకు సరిగ్గా అర్థమైందంటూ వెంకటేష్ రాసుకొచ్చాడు. వెంకటేష్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నాడు. ఆ జట్టు రూ.8 కోట్లకు ఈ యువ ప్లేయర్‌ను దక్కించుకుంది. మార్చి 26 నుంచి IPL మొదలుకానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా, చెన్నై మధ్య జరగనుంది. గతేడాది సీజన్‌లో అయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఈ ఆల్ రౌండర్ యూఏఈలో జరిగిన రెండో దశ ఐపీఎల్‌లో 370 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత భారత జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లలో అయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు సిరీస్‌లలో, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టులో భాగం కాలేదు. దీంతో వెంకటేష్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో 24 వికెట్లు తీసిన అవేష్ ఖాన్, ఐపీఎల్ 2022లో లక్నో జట్టు రూ.10 కోట్ల భారీ మొత్తం చెల్లించి తన జట్టుతో జతకట్టాడు. అవేష్ ప్రమాదకరమైన యార్కర్లకు పేరుగాంచాడు.

Also Read: Rajasthan Royals, IPL 2022: శాంసన్ సేన ఈసారైనా సక్సెస్ అయ్యేనా.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ తగ్గేదేలే..

ICC Women’s World Cup 2022: ఝులన్ గోస్వామి మరో రికార్డు.. ఆ లిస్టులో ప్రపంచంలోనే తొలి బౌలర్‌..