ఒకప్పుడు తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన హర్భజన్ సింగ్(Harbhajan Singh).. ప్రస్తుతం వ్యాఖ్యాతల ప్రపంచంలోనూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా చేస్తున్న హర్భజన్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ (IPL 2022) ప్రారంభానికి ముందు చెన్నై జట్టు కెప్టెన్‌ని మార్చింది. మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. రవీంద్ర జడేజాను తన నూతన సారథిగా ఎంచకుంది. అయితే, ధోనీ ఇప్పటికీ చెన్నైకి బాధ్యత వహిస్తున్నాడని, ఫీల్డింగ్ తలనొప్పి ధోనీపైనే ఉందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. జడేజాను కెప్టెన్‌గా చేయాలనే నిర్ణయానికి మద్దతిచ్చిన హర్భజన్ సింగ్.. అయితే అదే సమయంలో ఈ ఆటగాడు తన భుజాలపై మరింత బాధ్యత వహించాలని పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, ‘ఎంఎస్ ధోనీ ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడని నేను భావిస్తున్నాను. నేను జడేజాను చూసినప్పుడు, అతను 30-గజాల సర్కిల్ వెలుపల ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల మీరు చాలా విషయాలపై నియంత్రణ కోల్పోతారు. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడంలోని తలనొప్పులను ధోనీకి ఇచ్చాడు. జడేజా తన భారాన్ని తగ్గించుకుంటున్నాడు. అతను ధోనీకి ఫీల్డింగ్ బాధ్యతను ఇచ్చాడని తెలుస్తోంది.
కెప్టెన్‌గా ఉండటానికి జడేజా అర్హుడే: హర్భజన్
జడేజాను కెప్టెన్‌గా చేయడం సరైన నిర్ణయమని, అతను గొప్ప క్రికెటర్ అని హర్భజన్ సింగ్ అన్నాడు. హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, ‘జడేజా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని నేను భావిస్తున్నాను. అతని బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతం. అతను ప్రస్తుతం కొన్ని సమస్యలపై జట్టుతో మాట్లాడాలని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.
చెన్నై బౌలింగ్ బలహీనం: జడేజా
ప్రస్తుతం చెన్నై బౌలింగ్ చాలా బలహీనంగా ఉందని, బ్యాటింగ్ కూడా మెరుగవ్వాల్సి ఉందని హర్భజన్ సింగ్ అన్నాడు. కెప్టెన్‌గా జడేజా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నాడు. జడేజాకు అవగాహన అవసరం. అతను నేర్చుకుని, మైదానంలో అవలంభిస్తాడు. భజ్జీ ప్రకారం, ఈ సీజన్‌లో ధోనీ ఉనికి జడేజాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాడు.
Also Read: RR vs RCB Live Score, IPL 2022: టాస్ గెలిచిన బెంగళూరు.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?