IPL 2022 Mega Auction: తన బ్యాటింగ్ బలంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక మ్యాచ్‌లు గెలిచిన అంబటి రాయుడు(Ambati Rayudu), IPL 2022 వేలంలో (IPL 2022 Mega Auction) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంబటి రాయుడు వికెట్ కీపర్ (Ambati Rayudu Wicket-Keeper) కం బ్యాట్స్‌మెన్‌గా మెగా వేలంలోకి ప్రవేశించాడు. అంబటి రాయుడు బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడుతాడాని మనకు తెలిసిందే. అలాగే ఆఫ్ స్పిన్ కూడా చేయగలడని తక్కువ మందికి తెలుసు. అయితే, ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తానంటూ వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంబటి రాయుడు బేస్ ధర రూ.2 కోట్లుగా ఉంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కేవలం 5 వికెట్ కీపర్లు మాత్రమే తమ బేస్ ధర రూ. 2 కోట్లుగా ఉంచుకున్నారు. వారిలో ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ వేడ్‌లు ఉన్నారు.
రాయుడు 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.. రాయుడు ఐపీఎల్ 2022 నుంచి వికెట్ కీపర్‌గా మైదానంలోకి రావాలనుకుంటున్నాడు. ఇది పెద్ద విషయం. ఎందుకంటే వికెట్ కీపింగ్‌కు మంచి ఫిట్‌నెస్ అవసరం. అంటే ఈ ఆటగాడు తన ఫిట్‌నెస్‌పై కూడా చాలా కృషి చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాయుడు 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
2 సార్లు ఛాంపియన్ జట్టులో భాగస్వామ్యం..
రాయుడు మళ్లీ ధోని నాయకత్వంలో ఆడాలని కోరుకుంటున్నప్పటికీ, అంబటి రాయుడిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేయలేదు. తన ఫామ్, ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నందున రాబోయే మూడు సీజన్లలో ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు రాయుడు తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉంటూనే అంబటి రాయుడు 2 ఐపీఎల్‌లను గెలుచుకున్నాడు. 2018 సంవత్సరంలో రాయుడు చెన్నై జట్టులో భాగంగా ఉన్నాడు. అప్పుడు సీఎస్‌కే టీం ఛాంపియన్‌గా మారింది. 2019లో ఫైనల్‌లో చెన్నై ఓడిపోయింది. 2020లో జట్టు ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్లేఆఫ్‌లకు కూడా చేరుకోలేకపోయింది. ఆపై 2021లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి IPLని గెలుచుకుంది.
రాయుడు లెక్కలు సాటిలేనివి..
అంబటి రాయుడు అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తోపాటు మంచి ఫినిషర్. రాయుడు 174 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3916 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌తో ఒక సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు చేశాడు. గత సీజన్‌లో రాయుడు 16 మ్యాచ్‌ల్లో 28.55 సగటుతో 257 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ముంబై ఇండియన్స్‌పై అతను కేవలం 27 బంతుల్లో అజేయంగా 72 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. రాయుడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడంలో దిట్ట. రాయుడిపై చెన్నై మాత్రమే కాకుండా ఇతర ఫ్రాంచైజీలు కూడా పందెం కాస్తాయనడంలో సందేహం లేదు.
Also Read: U19 World Cup: సెమీఫైనల్ టెన్షన్ లేదు.. వారి బౌలింగ్ చాలా సాధారణమైంది: టీమిండియా అండర్-19 కెప్టెన్
IPL 2022 Auction: రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో 48 మంది ఆటగాళ్లు.. పూర్తి జాబితా ఇదిగో..