Watch Video: 102 మీటర్ల సిక్స్‌ కొట్టిన ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్.. గాయపడిన అభిమాని.. వైరల్ వీడియో..

| Edited By: Venkata Chari

May 14, 2022 | 1:50 PM

RCB ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతికి హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతికి రజత్ పాటిదార్ భారీ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ పొడవు 102 మీటర్లు. ఈ మ్యాచ్‌లో పాటిదార్ 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

Watch Video: 102 మీటర్ల సిక్స్‌ కొట్టిన ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్.. గాయపడిన అభిమాని.. వైరల్ వీడియో..
Ipl 2022 Pbks Vs Rcb Rajat Patidar
Follow us on

క్రికెట్(Cricket) మైదానంలో బ్యాట్స్‌మెన్‌ల భారీ షాట్లతో ప్రేక్షకులు ఎంతగానో సంబురపడిపోతుంటారు. అయితే, కొన్నిసార్లు మాత్రం ఆ బంతులు ప్రేక్షకులను గాయాల పాలు చేస్తుంటాయి. తాజాగా ఇదే పరిస్థితి ఐపీఎల్‌లో జరిగింది. ప్రేక్షకుల్లో కూర్చున్న క్రికెట్ అభిమాని గాయపడ్డాడు. మే 13 సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ (RCB vs PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటిదే కనిపించింది. RCB ఇన్నింగ్స్ సమయంలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) షాట్ ఆడాడు. దానిపై స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న వృద్ధ అభిమాని గాయపడ్డాడు. ఈ షాట్‌లో పాటిదార్, ఆర్‌సీబీ తరపున 6 పరుగులు సాధించగా, మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఈ సిక్స్‌కు బాధితుడయ్యాడు.

Also Read: Viral: ఇందుకే కదా మాతృదేవోభవ అనేది.. కూతురిని పెంచేందుకు పురుషావతారం ఎత్తిన తల్లి..

102 మీటర్ల పొడవైన సిక్స్‌..

ఇవి కూడా చదవండి

ఇది బెంగళూరు ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కనిపించింది. పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి రజత్ పాటిదార్ 102 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. దీంతో స్టేడియంలో కూర్చున్న వృద్ధ అభిమాని గాయపడ్డాడు. బంతి తగిలిన తర్వాత అతను ఎంతో బాధతో విలవిల్లాడిపోయాడు. అయితే, అతని సన్నిహితులు అతనికి ఉపశమనం కలిగించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అదృష్టవశాత్తూ, బంతికి ఆ వృద్ధుడి తల పగలలేదు.

20 ఏళ్ల క్రితం గంగూలీ కూడా ఇలాంటి సిక్స్ కొట్టాడు..

కాగా, స్టేడియంలో భారత బ్యాట్స్‌మెన్ కొట్టిన సిక్స్‌పై క్రికెట్ అభిమాని గాయపడడం ఇదే తొలిసారి కాదు. ఇది 20 ఏళ్ల క్రితం ఆగస్టు 2002లో కూడా జరిగింది. హెడింగ్లీ టెస్టు రెండో రోజు గంగూలీ సుదీర్ఘ సిక్సర్ కొట్టగా, బంతి వృద్ధ క్రికెట్ అభిమానిని తాకింది. బంతి తగలడంతో ఆ అభిమాని తల నుంచి రక్తం కారింది. ఆ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ 128 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

RCB 54 పరుగుల తేడాతో ఓటమి..

RCB బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతని జట్టు 54 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో RCB 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవడం ఇది 15వ సారి.

Also Read: Ambati Rayudu Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన చెన్నై ప్లేయర్.. ముంబైలో చివరి మ్యాచ్..

IPL 2022: అదృష్టాన్ని మార్చిన కెప్టెన్ త్యాగం.. ఓపెనింగ్‌లో అదరగొట్టిన ప్లేయర్.. కేవలం 29 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో ఊచకోత..