IPL 2022 New Teams Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఈరోజు మరో రెండు జట్లు వచ్చి చేరాయి. దుబాయ్‌లో రెండు కొత్త ఐపీఎల్ జట్ల కోసం బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ మేరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన బీసీసీఐ రెండు టీంలను ప్రకటించింది. ఇందులో అహ్మాదాబాద్, లక్నో నగరాల నుంచి రెండు టీంలు ఐపీఎల్‌లో చేరనున్నట్లు ప్రకటించింది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని RPSG గ్రూప్ లక్నో టీంను గెలుచుకుంది. దీనికోసం రూ. 7000 కోట్లకు బిడ్‌ను వేసి గెలుచుకుంది. అలాగే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC క్యాపిటల్ (ఇరేలియా అని కూడా పిలుస్తారు) అహ్మదాబాద్ టీంను గెలుచుకుంది. అహ్మదాబాద్ టీమ్‌ను రూ.5,200 కోట్లకు CVC క్యాపిటల్ సంస్థ దక్కించుకుంది. దీంతో బీసీసీఐకి రూ.12,200 కోట్ల ఆదాయం రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సమూహాలలో అదానీ గ్రూప్ కూడా బిడ్ దాఖలు చేసింది. కానీ, అదానీ గ్రూపు మాత్రం బిడ్‌లో గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కొత్త టీమ్‌లు ఏవన్న దానిపైనే అందరి దృష్టి నిలిచింది. బిడ్లను కాచి వడపోసిన అనంతరం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది. “ఐపీఎల్‌లోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను సంతోషిస్తున్నాను. ఇది ప్రారంభ దశ. మంచి జట్టును నిర్మించి, ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది” అని RPSG యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. ఆర్‌పీఎస్‌జీ గ్రూపు ఇంతకుముందు సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ నిషేధం టైంలో ఐపీఎల్‌లో కి ఎంట్రీ ఇచ్చారు. రెండు సీజన్లలో ఆడిన రైజింగ్ పుణే సూపర్‌జైంట్ (2016, 2017) జట్టును తీసుకున్నారు. ఈమేరకు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో వీరి మ్యాచులో జరగనున్నాయి. నవంబర్ 2018 నుంచి సందర్శకులకు అనుమతినిచ్చారు.
పోటీలో 6 నగరాలు.. గెలిచింది మాత్రం రెండే..
ఇందుకోసం 6 నగరాలు రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్, లక్నో వంటి జట్లు ఈ రేసులో ముందువరుసలో ఉన్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. అదే సమయంలో లక్నో ద్వారా, బిసీసీఐ ఐపీఎల్‌ను అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రానికి తీసుకెళ్లాలని కోరుకుంటుంది. దీంతో ఈ రెండు నగరాలపై బీసీసీఐ బాగా ఫోకస్ చేసింది.
Ahmedabad and Lucknow to be the two new teams at Indian Premier League (IPL). CVC Capital Partners gets Ahmedabad while RPSG Group gets Lucknow. pic.twitter.com/0zmQS7nQEb
— ANI (@ANI) October 25, 2021
పోటీదారులు..
ఈ రెండు జట్లను కొనుగోలు చేసేందుకు మొత్తం 22 వ్యాపార సంస్థలు ఆసక్తి చూపాయి. వారందరూ బిడ్డింగ్ పత్రాలను కొనుగోలు చేశారు. బిడ్డర్లలో అదానీ గ్రూప్, గ్లేజర్ ఫ్యామిలీ, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్‌పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందూస్తాన్ టైమ్స్ మీడియా గ్రూప్, మాజీ మంత్రి నవీన్ జిందాల్ యొక్క జిందాల్ స్టీల్, రోనీ స్క్రూవాలా, ముగ్గురు ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు ఉన్నారు.
వచ్చే సీజన్‌లో 10 జట్లు..
వచ్చే సీజన్ నుంచి జట్ల సంఖ్య 10కి పెరగడంతో ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య కూడా 60 నుంచి 74కి పెరగనుంది. ఆటగాళ్ల పరంగా మాట్లాడితే, రెండు జట్ల పెరుగుదలతో, కనీసం 45 నుంచి 50 మంది కొత్త ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. వీరిలో 30 నుంచి 35 మంది భారత యువ ఆటగాళ్లు ఉంటారు.
Sometimes you put in a bid just to win, come what may. I think #RPSG‘s oitnof this world bid of 7200 cr is in that category.
— Harsha Bhogle (@bhogleharsha) October 25, 2021
Bid submissions done ✅
Verification process underway here in Dubai ?
The Big Announcement soon ? pic.twitter.com/LbXGwxnrYR
— IndianPremierLeague (@IPL) October 25, 2021
IND vs PAK: రిజ్వాన్ మాములోడు కాదు.. పక్కా ప్లానింగ్‌తో వచ్చాడు.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఐసీసీ