ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు అంతంతమాత్రంగా ఉందనే చెప్పాలి. అయితే ఈ మాట కేవలం జడేజా కెప్టెన్సీలో మాత్రమేనని.. ధోని మరోసారి నిరూపించాడు. తాను కెప్టెన్సీ పగ్గాలను మరోసారి చేపట్టిన తర్వాత ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రేకుల్లేని బుల్డోజర్‌లా.. చెన్నైను ప్లే ఆఫ్స్‌కు చేర్చడమే నెక్స్ట్ స్టెప్‌లా దూసుకుపోతున్నాడు మహేంద్రసింగ్ ధోని. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధించిన విజయంతో సీఎస్‌కే క్యాంపులో ప్లేఆఫ్ ఆశలు చిగురించాయి. లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు టాప్ 4కి చేరవచ్చు. అయితే అలా చేరాలంటే.. ఈ 5 విషయాలు జరగాలి. అవేంటో చూసేద్దాం పదండి..
చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే, మిగిలిన 3 మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా విజయాలు సాధించాలి. ఇక రెండో విషయం ఏంటంటే.. కేకేఆర్ జట్టు మిగిలిన మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో ఓడిపోవాలి. అలాగే మూడో విషయం ఏమిటంటే.. ఆర్‌సీబీ మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. నాలుగో విషయం ఏంటంటే.. పంజాబ్ కింగ్స్.. బెంగళూరుతో జరగబోయే మ్యాచ్‌లో గెలిచి.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అలాగే చివరి విషయం.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌పై గెలిచి.. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాలి. ఇవి జరిగితే చెన్నై ప్లేఆఫ్స్ చేరడం సులభం. ఢిల్లీని ఓడించిన తర్వాత, చెన్నై రన్‌రేట్ మైనస్ నుంచి 0.028కి చేరింది.
Also Read: Viral: అట్లుంటది ముచ్చట మనతోని.. డీజేతో పోలీసులనే బ్రేక్ డ్యాన్స్ చేయించాడు.. చూస్తే మైండ్ బ్లాకే!