IPL-2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆ ఆటగాడిపై కోట్ల వర్షం కురుస్తుంది..! అతను ఎవరో చెప్పిన ఆకాష్ చోప్రా..

|

Jan 31, 2022 | 4:04 PM

అద్భుతమైన స్వింగ్, అద్భుతమైన స్లో డెలివరీలు, పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం. ఈ లక్షణాలన్నీ ఒక ఆటగాడిలో ఉన్నాయి.

IPL-2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆ ఆటగాడిపై కోట్ల వర్షం కురుస్తుంది..! అతను ఎవరో చెప్పిన ఆకాష్ చోప్రా..
Aakash Chopra
Follow us on

అద్భుతమైన స్వింగ్, అద్భుతమైన స్లో డెలివరీలు, పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం. ఈ లక్షణాలన్నీ ఒక ఆటగాడిలో ఉన్నాయి. ఈసారి IPL 2022 మెగా వేలం(IPL-2022 Mega Auction)లో అతనిపై కోట్ల వర్షం కురిపించబోతోంది. ఆ ఆటగాడు మరెవరో కాదు దీపక్ చాహర్(deepak chahar). ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో దీపక్ చాహర్ చాలాసార్లు హీరోగా నిరూపించుకున్నాడు. దీపక్ చాహర్ మెగా వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ బౌలర్ కావచ్చు అని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా పేర్కొన్నారు.

ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో దీపక్ చాహర్‌ను ప్రశంసిస్తూ, ‘దీపక్ చాహర్ కొత్త బంతితో వికెట్లు తీయడంలో నిపుణుడు. అతను తప్ప మరే ఇతర భారతీయ ఆటగాడికి ఈ పనిని నిరంతరం చేయగల సామర్థ్యం లేదు. మొదటి 3 ఓవర్లలో దీపక్ చాహర్ మీకు బ్యాంకు లాంటివాడు. అతను పవర్‌ప్లేలో మీకు వికెట్లు ఇస్తాడు. ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచడంలో నిష్ణాతుడు.’ అని చెప్పాడు.

దీపక్ చాహర్‌ను కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆకాశ్ చోప్రా చెప్పాడు. అలాగే లక్నో, అహ్మదాబాద్ జట్లు కూడా ఈ రేసులో దూకవచ్చన్నారు. ‘నేను దీపక్ చాహర్‌ను అద్భుతమైన డెత్ ఓవర్ బౌలర్ అని పిలవను, కానీ అతన్ని ఉపయోగించుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని, అహ్మదాబాద్, లక్నో కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తుందని నేను భావిస్తున్నాను. అందుకే దీపక్ చాహర్ చాలా ఖరీదైనదిగా నిరూపించుకోబోతున్నాడు. దీపక్ చాహర్ కూడా ఇప్పుడు బ్యాటింగ్ చేయగలడు.’ అని పేర్కొన్నాడు.

దీపక్ చాహర్ 115 టీ20 మ్యాచ్‌లలో 131 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు కూడా ఓవర్‌కు 7.61గా ఉంది. చాహర్ టీ20లో రెండు సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో దీపక్ చాహర్ 63 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. 2016లో దీప్‌ చాహర్‌ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. పూణే సూపర్‌జెయింట్‌లు దీపక్ చాహర్‌ను 2017 వరకు తమ జట్టులోకి తీసుకుంది. దీని తర్వాత చాహర్ చెన్నై తరపున ఆడాడు. 2018, 2021లో అతను IPL ఛాంపియన్ జట్టులో కూడా భాగమయ్యాడు. అయితే ఈ ఆటగాడిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. చెన్నై ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రితురాజ్ గైక్వాడ్‌లను కొనసాగించింది.

Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు.. కానీ అతడి ఫామ్ కలవరపెడుతుంది.. భారత మాజీ బౌలర్..