IPL 2022: షాకివ్వనున్న బీసీసీఐ కొత్త రూల్స్.. పాటించకుంటే కోత.. ఆటగాళ్ల వేతనాలపైనా క్లారిటీ..!

|

Oct 30, 2021 | 8:45 PM

IPL 2022కి ముందు ఆటగాళ్ల మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 10 జట్ల మధ్య బిడ్డింగ్ ఉంటుంది. తాజాగా ఐపీఎల్‌లో లక్నో, అహ్మదాబాద్‌ల రూపంలో రెండు కొత్త జట్లు చేరాయి.

IPL 2022: షాకివ్వనున్న బీసీసీఐ కొత్త రూల్స్.. పాటించకుంటే కోత.. ఆటగాళ్ల వేతనాలపైనా క్లారిటీ..!
Ipl 2022
Follow us on

IPL 2022: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలపై భారత క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. దీనిపై మొత్తం 10 బృందాలకు సమాచారం అందించారు. అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్ల సంఖ్యను నిర్ణయించడంతో పాటు ఒక్కో ఆటగాడికి అందించే మొత్తాన్ని కూడా బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు IPL 2022 మెగా వేలానికి ముందు ఒక్కొక్కరు నలుగురిని ఉంచుకోవచ్చని తెలిసిందే. అదే సమయంలో, టోర్నమెంట్‌లోకి వచ్చిన మరో రెండు కొత్త జట్లు వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను జోడించవచ్చని తెలిపింది. ఈ మేరకు క్రిక్‌బజ్ నివేదికలో పేర్కొంది. ఫ్రాంచైజీ యజమానులకు బీసీసీఐ పంపిన మెయిల్‌ను అందించింది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ఎనిమిది పాత జట్లు ఉన్నాయి. అదే సమయంలో, లక్నో, అహ్మదాబాద్ ఇటీవల టోర్నమెంట్‌లోకి కొత్తగా వచ్చాయి.

ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది. దీని తర్వాత, వేలానికి ముందు కొత్త జట్లు ముగ్గురు ఆటగాళ్లను జోడించుకోవచ్చని తెలిపింది. ఆటగాళ్లను తమతో తీసుకెళ్లేందుకు ఒక్కో జట్టుకు గరిష్టంగా రూ.90 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ఎనిమిది పాత జట్లు నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2021 మధ్య ఆటగాళ్లను కలిగి ఉండాలని పేర్కొంది. అదే సమయంలో, రెండు కొత్త జట్లు డిసెంబర్ 1 నుంచి 25 మధ్య ఆటగాళ్లను కలిగి ఉండాలని పేర్కొంది.

అట్టిపెట్టుకునేందుకు నియమాలు..
పాత ఎనిమిది జట్లు గరిష్టంగా ముగ్గురు భారత ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. వీరిలో క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఏ జట్టు కూడా ఇద్దరు కంటే ఎక్కువ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేయలేరు. అదే సమయంలో, పాత జట్లు గరిష్టంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కొత్త జట్ల విషయానికొస్తే, వారు గరిష్టంగా ఇద్దరు భారతీయ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. వారిలో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని మాత్రమే తమతో తీసుకెళ్లగలరు.

రిటైన్ చేసుకునే ఆటగాళ్ల నియమాలు..
ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను ఉంచుకుంటే రూ.42 కోట్లు కోత విధిస్తారు.
ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే రూ. 33 కోట్లు తగ్గుతాయి.
ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే రూ.24 కోట్లు కోత పడుతుంది.
ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ.14 కోట్లు కోత విధిస్తారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రూ.4 కోట్లకు మించి ఉంచుకోలేరు.

నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే..
మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు,
రెండో ఆటగాడికి రూ .12 కోట్లు,
మూడో ఆటగాడికి రూ. 8 కోట్లు,
నాలుగో ఆటగాడికి రూ.6 కోట్లు లభిస్తాయి.

ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే..
మొదటి ఆటగాడికి రూ.15 కోట్లు,
రెండో ఆటగాడికి రూ.11 కోట్లు,
మూడో ఆటగాడికి రూ .7 కోట్లు లభించనున్నాయి.

ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే..
మొదటి ఆటగాడికి రూ.14 కోట్లు,
రెండో ఆటగాడికి రూ .10 కోట్లు లభించనున్నాయి.

ఒక ఆటగాడిని అట్టిపెట్టుకుంటే ప్రతి సంవత్సరం రూ.14 కోట్లు లభిస్తాయి.

Also Read: SA vs SL Match Result: మిల్లర్ ‘కిల్లింగ్’ ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ ఆశలు సజీవం

ENG vs AUS Live Score, T20 World Cup 2021: ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మాథ్యూ వేడ్ (18)ఔట్.. స్కోర్ 51/5