Watch Video: సిక్స్‌ల వర్షం వెనుక అసలు స్టోరీ ఇదే? కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Apr 10, 2023 | 2:41 PM

IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టిన బ్యాట్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఏమన్నాడంటే..

Watch Video: సిక్స్‌ల వర్షం వెనుక అసలు స్టోరీ ఇదే? కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా ఆసక్తికర వ్యాఖ్యలు..
Rinku Singh Bat Viral
Follow us on

చివరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గెలిపించిన రింకూ సింగ్ పేరు చరిత్ర పుటల్లో నమోదైంది. ఏప్రిల్ 9న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ చరిష్మా చూపించాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్ట్రయిక్‌లో ఉన్న రింకూ సింగ్.. గుజరాత్ జెయింట్స్ బౌలర్ యశ్ దయాల్‌ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. రింకూ సింగ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టిన బ్యాట్‌కి భిన్నమైన కథ ఉంది. ఈ విషయాన్ని కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా షేర్ చేశాడు.

నితీష్ రాణా బ్యాట్‌తో సిక్స్‌ల వర్షం..

నిజానికి మ్యాచ్ చివరి ఓవర్లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదిన బ్యాట్ నితీష్ రాణాది కావడం గమనార్హం. ఏప్రిల్ 9న నితీష్ రాణా తన బ్యాట్ మార్చారు. అంతకుముందు, గత ఐపీఎల్ సీజన్‌లో నితీష్ ఈ బ్యాట్‌తో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఈ సంవత్సరం, దేశవాళీ క్రికెట్‌తో పాటు, అతను ఈ బ్యాట్‌తో IPL 2023లో 2 మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఏప్రిల్ 9న అతను బ్యాట్ మార్చాడు. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా మాట్లాడుతూ, ‘రింకూ నన్ను బ్యాట్ అడిగాడు. నేను ఇవ్వదలచుకోలేదు. కానీ, లోపలి నుంచి ఎవరో తీసుకొచ్చారు. మంచి పిక్-అప్ ఉన్నందున రింకూ దీన్ని తీసుకుంటాడు అని నాకు అనిపించింది. దీని బరువు కూడా తక్కువే. ఇప్పుడు అది రింకూ బ్యాట్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన గుజరాత్‌..

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 155 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకానొక సమయంలో KKR స్కోరు 4 వికెట్లకు 155. కానీ, రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా KKR ను బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ 21 బంతుల్లో 48 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను ఒక ఫోర్ సహా 6 సిక్సర్లు కొట్టాడు. IPL 2023లో KKRకి ఇది వరుసగా రెండో విజయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..