AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Final Match: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై జైషా కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే?

IPL 2022: IPL 15లో ప్లేఆఫ్‌ల రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ప్రతి జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

IPL 2022 Final Match: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై జైషా కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందంటే?
Ipl 2022 Final Match Bcci Secretary Jay Shah
Venkata Chari
|

Updated on: May 03, 2022 | 7:30 PM

Share

IPL 2022 Playoff: ఐపీఎల్ 15లో ప్లేఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ప్రతి జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాగా, ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌, ఫైనల్‌(IPL Final) మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక సమాచారం అందించారు. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, ఫైనల్ మ్యాచ్‌ ఎక్కడ నిర్వహించనున్న సంగతి నేడు తేల్చేశారు. ఐపీఎల్ ప్లేఆఫ్‌ల నిర్వహణపై బీసీసీఐ సెక్రటరీ జైషా(BCCI secretary Jay Shah) మాట్లాడుతూ, ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, కోల్‌కతాలో జరుగుతాయని చెప్పారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది. దీంతో పాటు క్వాలిఫయర్ 2 కూడా మే 27న అహ్మదాబాద్‌లోనే జరగనుంది. ఇది కాకుండా, క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ వరుసగా మే 24-25 తేదీలలో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయని పేర్కొన్నారు.

ఈసారి ఐపీఎల్ సీజన్ మార్చి 26న ప్రారంభమైంది. ఈ క్రమంలో ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగగా.. ఆ తర్వాత మే 29న ఆఖరి మ్యాచ్ జరగనుంది. మే 29 న అహ్మదాబాద్‌లో ఐపీఎల్ చివరి మ్యాచ్ ఆడవచ్చని దీనికి ముందు కూడా ఊహాగానాలు జరిగిన సంగతి తెలిసిందే.

ఉత్కంఠగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు..

ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌ల రేసు ఈ సమయంలో చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ముంబై ఇండియన్స్ మినహా మిగతా అన్ని జట్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో కూడా గుజరాత్ జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్‌లు గెలిచి దాదాపు ప్లేఆఫ్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: GT vs PBKS Live Score, IPL 2022: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?

IPL 2022: ‘అతను మరో మహేంద్ర సింగ్ ధోని.. కూల్‌గా క్లైమాక్స్‌లో విధ్వంసం’