IPL 2022: ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. కెప్టెన్ రిషబ్ పంత్ దగ్గర ఒంటి చేత్తో సిక్స్ కొట్టడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నాడు. అలాంటి షాట్ల ద్వారా పంత్ చాలా పరుగులు చేస్తాడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ రెండోసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2009లో వార్నర్ మొదటిసారిగా ఐపీఎల్‌లో ఆడాడు. ఇప్పుడు ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడు. అతను ప్లేయింగ్ XIలో చేరడం ఖాయం. పాకిస్థాన్-ఆస్ట్రేలియా సిరీస్ కారణంగా వార్నర్ ఇంకా IPL 2022లో ఆడలేదు. ఏప్రిల్ 6న డేవిడ్ వార్నర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘నేను రిషబ్ నుంచి ఒంటి చేత్తో షాట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అతను యువ కెప్టెన్ అంతేకాకుండా భారత జట్టులో అంతర్భాగం. అతనితో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను’ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ‘రికీ పాంటింగ్‌కి ఢిల్లీతో అనుబంధం ఎక్కువ. అతను ఆస్ట్రేలియాకు విజయవంతమైన కెప్టెన్. ఇప్పుడు కోచ్‌గా కూడా గౌరవం పొందుతున్నాడు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం అవుతుంది’
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు సంబంధించి వార్నర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో పూర్తి శక్తితో ఆడాల్సి ఉందన్నాడు. ఫీల్డింగ్ అనేది ఆటలో అతిపెద్ద భాగం. క్యాచ్‌లను అస్సలు మిస్ చేయకూడదు. అప్పుడే టోర్నమెంట్‌లో చాలా దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. మొత్తం మీద ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడు. విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో మొదటివాడు. 143 మ్యాచ్‌లు ఆడి 5286 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
The smile says it all ?
? | This season’s first interview with @davidwarner31 ?? He is excited and ready to ROAR for Delhi again ??#YehHaiNayiDilli | #IPL2022 | #TATAIPL | #IPL | #DelhiCapitals | #CapitalsUnplugged | @TajMahalMumbai | #OctaRoarsForDC pic.twitter.com/gYfSVj1TWH
— Delhi Capitals (@DelhiCapitals) April 6, 2022