IPL 2022: రియల్ హీరోలకు సెల్యూట్ చేసిన బీసీసీఐ.. బహుమతిగా ఎన్ని కోట్లిచ్చిందంటే?

ఐపీఎల్ 15వ సీజన్ ముగిసింది. ఈ సమయంలో లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, MCA గ్రౌండ్‌లలో జరిగాయి. ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా పిచ్ క్యూరేటర్‌కు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు.

IPL 2022: రియల్ హీరోలకు సెల్యూట్ చేసిన బీసీసీఐ.. బహుమతిగా ఎన్ని కోట్లిచ్చిందంటే?
International Cricket Council Jay Shah

Updated on: May 31, 2022 | 6:50 AM

IPL 2022: ఐపీఎల్ 2022 (IPL 15) సీజన్ ముగిసింది. ఈ సమయంలో లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రాబ్రోన్, ఎంసీఏ గ్రౌండ్స్‌లో జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ సెక్రటరీ జైషా భారీ బహుమతిని అందించారు. అన్ని స్టేడియాల పిచ్ క్యూరేటర్లకు రివార్డు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా సమాచారం అందించారు.

జైషా ఏమన్నారంటే?

ఇవి కూడా చదవండి

పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్‌కు సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జైషా పెద్ద ప్రకటన చేశారు. ఐపీఎల్‌లోని అన్‌సంగ్ హీరోలకు రూ. 1.25 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశాడు. TATA IPL 2022లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారంటూ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో మేం చాలా హై వోల్టేజ్ గేమ్‌లను చూశామంటూ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌ల కోసం పిచ్‌ క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌లు తీవ్రంగా శ్రమించారు. ఇలాంటి పరిస్థితుల్లో పూణెలోని సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్, ఎంసీఏలకు చెందిన ఒక్కో పిచ్ క్యూరేటర్‌కు రూ.25 లక్షలు, ఈడెన్, నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ క్యూరేటర్‌లకు రూ.12.5 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు.

గుజరాత్ గెలిచింది..

రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 18.1 ఓవర్లలో గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు కోసం అద్భుతంగా పనిచేశారు. పాండ్యా 34 పరుగులతో పాటు 3 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..