Watch Video: భారీ సిక్సర్ బాదిన లక్నో యంగ్ బ్యాటర్.. గాయపడిన సీఎస్‌కే ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Ayush Badoni, LSG vs CSK, IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్‌‌ను శివమ్ దూబే సంధించాడు. అయితే, ఆయుష్ బదోని కొట్టిన ఓ సిక్స్ గ్యాలరీలో కూర్చున్న మహిళ తలకు బలంగా తగిలింది.

Watch Video: భారీ సిక్సర్ బాదిన లక్నో యంగ్ బ్యాటర్.. గాయపడిన సీఎస్‌కే ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Ayush Badoni Six Lsg Vs Csk
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2022 | 5:29 PM

గురువారం లక్నో, చెన్నై(LSG vs CSK) మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. లక్నోకు 211 పరుగుల లక్ష్యాన్ని చెన్నై అందించగా, 20వ ఓవర్లో లక్నో టీం టార్గెట్‌ను ఛేదించింది. లక్నో ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. లక్నో(Lucknow Super Giants) తరపున ఆడుతున్న ఆయుష్ బదోని(Ayush Badoni,) కొట్టిన ఓ బంతి గ్యాలరీలో కూర్చున్న ఓ మహిళకు బలంగా తగిలింది. శివమ్ దూబే వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని అద్భుత స్వీప్ షాట్‌తో బదోని సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ బంతి మహిళ తలకు బలంగా తగలడంతో, ఆమె నొప్పితో మూలుగుతూ తన తలను నిమురుతూ కనిపించింది. గాయపడిన అభిమానితో పాటు మరో మహిళ ఆమెను కౌగిలించుకున్నారు. చుట్టూ ఉన్న ప్రేక్షకులందరూ వారి వద్దకు చేరుకున్నారు. అయితే, ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు. కొంత సమయం తర్వాత ఆమె మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కెమోరాకు కనిపించింది. ఆ మహిళ చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానిగా కనిపించింది.

ఐపీఎల్‌కు ముందు రోహిత్ శర్మ కూడా..

ఐపీఎల్ ప్రారంభానికి ముందు, భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌ తొలిరోజున టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొట్టిన సిక్స్‌ చాలా ప్రమాదకరంగా మారింది. దీంతో ఓ ప్రేక్షకుడి ముక్కు ఎముక విరిగిపోయింది. కుట్లు వేయాల్సి వచ్చింది.

ఆయుష్ బదోని అద్భుత ఇన్నింగ్స్..

22 ఏళ్ల ఆయుష్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ తన బ్యాటింగ్‌తో భయాందోళనలు సృష్టించాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు అందించాడు. చివరి 9 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 211.11గా నిలిచింది. శివమ్ దూబే కొట్టిన సిక్సర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యుత్తమ షాట్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. లక్నో జట్టు ఆయుష్‌పై ఉంచిన విశ్వాసం అద్భుతమైనది.

Also Read: IPL Points Table 2022: అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్.. బెంగళూర్ సొంతమైన ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు..

IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయంపై స్పందించిన జడేజా.. తమ ఓటమికి కారణాలు ఇవేనంటూ..