కరోనా కట్టడికి ఇండియా సాగిస్తున్న పోరులో భాగంగా సన్ రైజర్స్ ఆటగాడు తన వంతు సాయాన్ని అందించాడు. ఆక్సిజన్ సరఫరాకు రూ. 90 వేలు విరాళం ఇచ్చి.. తన పెద్ద మనసును చాటుకున్నాడు ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్ శ్రీవత్స్ గోస్వామి. ఈ విషయాన్ని డొనాటేకర్ట్ అనే ఛారిటీ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అత్యవసర సమయంలో సాయం చేసినందుకు గోస్వామికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి స్పందించిన శ్రీవత్స్.. కష్ట సమయంలో అందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలని.. ప్రజలను సాయం చేయమని కోరాడు.
ఇదిలా ఉంటే ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ 1 బిట్ కాయిన్ ను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలను అందించిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా సెకండ్ వేవ్ తో ఇండియా అల్లాడిపోతున్న వేళ సాయం చేసేందుకు ముందుకొచ్చిన తొలి స్వదేశీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి కావడంతో నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన శ్రీవత్స్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విదితమే.
Happy to help ? please donate and reach out 🙂 we are in this together https://t.co/cKs9EZbnxM
— Shreevats goswami (@shreevats1) April 28, 2021
Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?
ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..
ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!