AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: రాజస్థాన్ జట్టుకు మూడు ఎదురుదెబ్బలు.. కోహ్లీసేనకు మరో విజయం లాంఛనమే.!

ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది....

IPL 2021: రాజస్థాన్ జట్టుకు మూడు ఎదురుదెబ్బలు.. కోహ్లీసేనకు మరో విజయం లాంఛనమే.!
Ravi Kiran
|

Updated on: Apr 22, 2021 | 3:05 PM

Share

ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కోహ్లీసేన హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ ఆడిన మూడింటిల్లో మూడు గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్ రెండు ఓడిపోయి ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో బెంగళూరుకే విజయావకాశాలు ఎక్కువ. అంతేకాకుండా రాజస్థాన్ కు ఇప్పటికే మూడు ఎదురుదెబ్బలు తగిలాయి.

మొదటిగా టోర్నీ ముందే ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కు గాయం కావడంతో.. అతడు దాదాపుగా సగం మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇక ఆర్చర్ షాక్ నుంచి కోలుకునేలోపే స్టోక్స్ కు వేలి గాయం అయి టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.

ఆర్చర్, బెన్ స్టాక్స్..ఇప్పుడు లివింగ్ స్టన్

ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే రాజస్థాన్ జట్టు మూడో ఎదురుదెబ్బ తగిలింది. బయోబబుల్ అలసట కారణంగా టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టన్. రాజస్థాన్ జట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం.. లివింగ్ స్టన్ ఏప్రిల్ 19న ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. దీనితో రాయల్స్.. బెంగళూరుకు పెద్దగా పోటీ ఇచ్చేలా కనిపించట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.!

Read also:

Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!

Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

Follow Us