Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: రోహిత్ శర్మ ముందు ధోని-కోహ్లీ విఫలం.. ప్రస్తుతం తొలి స్థానంలో రిషబ్ పంత్ టీం..!

IPL 2021: ఐపీఎల్ ప్రయాణం 14 వ సీజన్‌కు చేరుకుంది. జట్ల మధ్య పోటీ చాలా పెరిగింది. గణాంకాల ఆధారంగా టీంలు ఒకరితో ఒకరు ధీటుగా పోరాడుతున్నారు.

IPL 2021: రోహిత్ శర్మ ముందు ధోని-కోహ్లీ విఫలం.. ప్రస్తుతం తొలి స్థానంలో రిషబ్ పంత్ టీం..!
Ipl 2021
Follow us
Venkata Chari

|

Updated on: Sep 16, 2021 | 2:06 PM

IPL 2021: సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మరలా ప్రారంభం కానుంది. ఎనిమిది జట్ల మధ్య ఛాంపియన్‌గా మారే రేసు మొదలుకానుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మూడుసార్లు విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట తలపడనున్నాయి. మేలో టోర్నమెంట్ ఆగిపోయినప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందు వరుసలో ఉంది. తరువాత చెన్నై, ముంబై నిలిచాయి. ఐపీఎల్ 14 వ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో ఈ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ జట్టు ఉత్తమ రికార్డులు కలిగి ఉందో చూద్దాం.

ముంబై ఇండియన్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు మైదానంలోకి ప్రవేశించినప్పుడల్లా, కేకేఆర్‌పై విజయం సాధించే బలమైన పోటీదారుగా ఉంటుంది. షారుఖ్ ఖాన్, కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యంలో ఉన్న జట్టుతో ముంబై 22 మ్యాచ్‌లు గెలిచింది. ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా అత్యధిక విజయాలు సాధించిన రికార్డుగా ఇది నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 28 మ్యాచ్‌లు జరిగాయి. కేకేఆర్ ఇందులో ఆరు మాత్రమే గెలిచింది.

ముంబై ఇండియన్స్ పేరు కూడా రెండవ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌పై 19 మ్యాచ్‌లు గెలిచింది. ఐపీఎల్‌లో ధోనీ టీం అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ ముందు తలవంచక తప్పలేదు. అందుకే చెన్నై ఫైనల్స్‌లో మూడుసార్లు ముంబై చేతిలో ఓడిపోయింది. ఇద్దరి మధ్య మొత్తం 31 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 12 మాత్రమే చెన్నై గెలిచింది. అయితే, 2019 ఐపీఎల్‌కి ముందు రెండు జట్లు సమానంగా ఉన్నాయి. కానీ ఐపీఎల్‌ 2019 లో ముంబై వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది. రెండు జట్ల మధ్య జరిగిన చివరి ఏడు మ్యాచ్‌లలో ముంబై ఆరు గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రికార్డు ముంబై ఇండియన్స్‌పై గొప్పగా ఏం లేదు. కానీ పంజాబ్ కింగ్స్‌పై ఈ జట్టు అగ్రస్థానంలో ఉంది. కేకేఆర్ ప్రీతి జింటా యాజమాన్యంలో ఉన్న జట్టుపై 19 మ్యాచ్‌లు గెలిచింది. ఈ రెండు జట్లు 28 సార్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ కేవలం తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఉన్న జట్టు ఇంకా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. బలమైన జట్ల ముందు అతని పేలవమైన రికార్డు దీనికి పెద్ద కారణంగా ఉంది. ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు ఇప్పటివరకు చెరో 17 సార్లు ఆర్‌సీబీని ఓడించాయి. ఈ జట్లు ఆర్‌సీబీని ఓడించినంతగా మరెవరూ ఓడించలేకపోయారు. ముంబై, బెంగళూరు 27 సార్లు తలపడ్డాయి. కోహ్లీ జట్టు కేవలం 10 సార్లు మాత్రమే విజయం సాధించాడు. మరోవైపు, చెన్నై, బెంగళూరు గురించి మాట్లాడితే, ఈ రెండింటి మధ్య 28 మ్యాచుల్లో ఢీకొన్నాయి. ఆర్‌సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ రికార్డు కూడా బాగుంది. ఈ జట్టుపై 16 మ్యాచ్‌లు గెలిచింది. వీటిలో ఐపీఎల్ 2020 లో నాలుగు గెలిచింది. గత సీజన్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని జట్లను ఓడించింది. కానీ, ప్రతీసారి ముంబై చేతిలో ఓడిపోయింది. ఇద్దరూ చివరిగా నాలుగు మ్యాచ్‌లు ఆడారు. ఈ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఢిల్లీ 13 సార్లు గెలిచింది.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై కూడా మంచి రికార్డును కలిగి ఉంది. మొదటిసారి ఛాంపియన్ జట్టును 15 సార్లు ఎల్లో ఆర్మీ ఓడించింది. ఇరు జట్లు 15 సార్లు తలపడగా, రాజస్థాన్ 10 సార్లు గెలిచింది.

Also Read: First Hat-Trick in T20s: టీ20లో తొలి హ్యాట్రిక్ ఎప్పుడు నమోదైందో తెలుసా..? ఆ బౌలర్ ఎవరంటే? వీడియో

Most Ducks in T20 Cricket: వీరంతా టీ20 స్టార్ ప్లేయర్లు.. డకౌట్‌లో మాత్రం పోటీపడి మరీ రికార్డులు.. ఎవరో తెలుసా?