First Hat-Trick in T20s: టీ20లో తొలి హ్యాట్రిక్ ఎప్పుడు నమోదైందో తెలుసా..? ఆ బౌలర్ ఎవరంటే? వీడియో
ఈ బౌలర్ సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఓ రికార్డు నెలకొల్పి టీ20లో తొలి బౌలర్‌గా మారాడు. అతనెవరో తెలుసా..?
First Hat-Trick in T20s: ఆస్ట్రేలియా ఆటగాడు అతని టైంలో బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన ఈ బౌలర్.. ఎందరికో పీడకలలా మిగిలాడు. ఈ బౌలర్ సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఓ రికార్డు నెలకొల్పి టీ20లో తొలి బౌలర్‌గా మారాడు. అతనెవరో తెలుసా..? ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌లీ. టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాందేశ్‌పై ఈ ఆస్ట్రేలియా పేసర్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ టీంల మధ్య న్యూలాండ్స్, కేప్ టౌన్‌లో ఈ మ్యాచ్ జరిగింది.
బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసిన ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 8 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఇందులో బ్రెట్‌లీ బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్, ముష్రఫే మోర్తజా, అలోక్ కపాలిలను ఫెవిలియన్ చేర్చి ఇన్నింగ్స్ 17 వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించాడు.
ఆస్ట్రేలియన్ పేసర్ తన నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఈ మ్యాచులో ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ కోల్పోయి మరో 37 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. మథ్యూ హెడెన్, రికీ పాంటింగ్ వరుసగా 73, 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియాకు విజయం చేకూర్చారు.
కాగా, ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో 14 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్‌లో మాత్రం తొలి హ్యాట్రిక్ ఈ ఆస్ట్రేలియా ఆటగాడిపేరుతో లిఖించబడింది. అయితే, ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్ సాధించాడు. అలాగే టీ20 క్రికెట్‌లో శ్రీలంక మిస్టరీ బౌలర్ లసిత్ మలింగ రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్‌గా పేరుగాంచాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాలపై ఈ ఘనత సాధించాడు. 2019లో బంగ్లాదేశ్‌పై ఈ ఫీట్ సాధించిన లిస్టులో భారత బౌలర్ దీపక్ చాహర్ కూడా ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారతీయుడిగా నిలిచాడు. Also Read: Most Ducks in T20 Cricket: వీరంతా టీ20 స్టార్ ప్లేయర్లు.. డకౌట్‌లో మాత్రం పోటీపడి మరీ రికార్డులు.. ఎవరో తెలుసా?
Ashes Series: యాషెస్ సిరీస్‌లో సంక్షోభం.. ఇంగ్లండ్ ఆటగాళ్లు బహిష్కరించే అవకాశం.. ఎందుకో తెలుసా?