ఐపీఎల్ 2021లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 57 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 171 పరుగులు చేయగా.. చెన్నై టార్గెట్ ను సునాయాసంగా చేధించగలిగింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. ”తన ఇన్నింగ్స్ పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. తాను చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడానని.. ఓటమికి బాధ్యత పూర్తిగా తనదేనని వెల్లడించాడు. తన స్లో బ్యాటింగ్ జట్టుకు భారంగా ఉంటోందని వార్నర్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో వార్నర్ పలు రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో 50 అర్ధ సెంచరీలతో పాటు టీ20లో 10,000 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో వార్నర్ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడగా.. అందులో ఒకటి నెగ్గి.. ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?
ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..
ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!