Cricket News: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారీ షాక్ ఇచ్చిన ఒలింపిక్స్ కమిటీ..
Los Angeles Olympics 2028: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత 2032లో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఒలింపిక్స్ 2032కి ఆతిథ్యం ఇవ్వనుంది.

ఒలింపిక్ క్రీడలు 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి. లాస్ ఏంజెల్స్‌లో క్రికెట్‌ను చేర్చవచ్చని భావించారు. అయితే, క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ ఉంది. లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్స్‌లో క్రికెట్ కనిపించదు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు సమాచారం అందించింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత 2032లో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఒలింపిక్స్ 2032కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పుడు క్రికెట్ అభిమానులు బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆశించవచ్చని తెలుస్తోంది.
ఒలింపిక్స్‌లో క్రికెట్ చరిత్ర..
ఇప్పటి వరకు క్రికెట్ ఆట ఒలింపిక్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగింది. 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. అయితే అప్పటి నుంచి క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కావడంలో విఫలమైంది. 1900 ఒలింపిక్స్ పారిస్‌లో జరిగాయి. ఆ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో కేవలం 2 జట్లు మాత్రమే పాల్గొన్నాయి.
కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ భాగం..
గతేడాది ఫిబ్రవరి నెలలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో, 28 క్రీడలు ఎంపిక చేశారు. ఇవి 2028 ఒలింపిక్స్‌లో భాగంగా ఉంటాయి. అయితే ఆ తర్వాత 8 క్రీడలు షార్ట్‌లిస్ట్ చేశారు. రానున్న కాలంలో ఇతర క్రీడలను కూడా చేర్చవచ్చని భావించగా, అందులో క్రికెట్ పేరు కూడా తెరపైకి వస్తోంది. విశేషమేమిటంటే, గత సంవత్సరం, దాదాపు 24 సంవత్సరాల తర్వాత బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. అంతకు ముందు 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఆడేవారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీల్లో భారత్ సహా ఎనిమిది జట్లు చోటు దక్కించుకున్నాయి.




మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




