Indw vs Engw: టీమిండియా మహిళలు ప్రస్తుతం ఇంగ్లండ్ టీంతో మూడు టీ20ల సిరీస్ లో తపడుతోన్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈమేరకు మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమానం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ దూకుడుగా ఆడి 48 పరుగులు సాధించింది. ఇందులో 8ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. నాలుగో ఓవర్ లో ఓపెనర్ షెఫాలీ వరుసగా ఐదు ఫోర్లు బాది సూపర్ ఫాంను అందుకుంది. మరో ఓపెనర్ హర్మన్ ప్రీత్ 31 పరుగులు చేయగా, దీప్తీ శర్మ 24 నాటౌట్ తో రాణించింది. అనంతరం 150 పరుగలు లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి కేవలం 140 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో బీమాంట్ 59 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇంగ్లండ్ విజయానికి 20 ఓవర్లో 14 పరుగులు అవసరం అయ్యాయి. కానీ, ఆ టీం కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ లో కీలకమైన బీమాంట్ వికెట్ ను తీసిన దీప్తీ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు అందుకుంది.
అయితే, ఈ మ్యాచ్ లో ఓ రన్ ఔట్ వివాదాస్పదంగా మారింది. రెండో టీ20 సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హెదర్ నైట్ రనౌట్ అయింది. అయితే ఈ రనౌట్ ప్రస్తుతం వివాదాస్పదంగా తయారైంది. 14 ఓవర్ లో దీప్తి శర్మ బౌలింగ్ చేస్తుంది. ఈమేరకు క్రీజులో జోన్స్, హెదర్ నైట్ ఉన్నారు. చివరి బంతిని జోన్స్ స్ట్రెయిట్ షాట్ ఆడింది. అయితే, రన్ కోసం హెదర్ ప్రయత్నించి కొంచెం ముందుకు వెళ్లింది. ఆ బాల్ బౌలర్ దీప్తీ కాళ్లను టచ్ చేసి వెళ్లి స్టంప్స్ ను తాకింది. ఈమేరకు దీప్తీ, షెఫాలీ ఔట్ అంటూ సంబురాలు మొదలెట్టారు. దీనిని అంపైర్ రనౌట్ గా ప్రకటించడంతో.. షాకవ్వడం ఇంగ్లండ్ కెప్టెన్ వంతైంది.
కాగా, ఈ విషయంపై కొందరు క్రికెటర్లు స్పందించి విమర్శలు గుప్పించారు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ అలెక్స్ ..”కావాలనే బ్యాట్స్ మెన్ ని అడ్డుకుందని, ఇది నాటౌట్ అని” పేర్కొన్నాడు. అలాగే మార్క్ బచర్ మాట్లాడుతూ, ‘బౌలర్.. బ్యాట్స్ మెన్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోకపోయి ఉంటే.. ఇంగ్లండ్ కెప్టెన్ ఔట్ అయినట్లే కదా’ అంటూ తన బాణిని వినిపించారు. అయితే, ఈ రనౌట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ఐసీసీ రూల్స్ మేరకు చేతల ద్వారా గానీ, మాటల ద్వారా కానీ లేదా ఉద్దేవపూర్వకంగా బ్యాట్స్ మెన్ ను బౌలర్ అడ్డుకుంటే తప్పకుండా శిక్షకు అర్హులే. మరి ఈ విషయంపై అంపైర్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఈమేరక కామెంట్లు చేసిన యూజర్లు… చాలా అరుదైన రనౌట్ చేశారంటూ ఒకరు, టీమిండియా మెన్స్ కంటే.. మహిళలు చాలా బాగా ఆడుతున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు.
Also Read: