కొత్త చరిత్ర అడుగులు .. తొలి డేనైట్ టెస్టుకు రెడీ అవుతున్న భారత మహిళా జట్టు

|

May 20, 2021 | 8:43 PM

Indian womens cricket: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ కోసం భారత మహిళా జట్టు రెడీ అవుతోంది. అయితే ఈ సిరీస్​లో ఓ డేనైట్ మ్యాచ్​ కూడా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు.

కొత్త చరిత్ర అడుగులు .. తొలి డేనైట్ టెస్టుకు రెడీ అవుతున్న భారత మహిళా జట్టు
Indian womens cricket
Follow us on

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ కోసం భారత మహిళా జట్టు రెడీ అవుతోంది. తొలి డేనైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నామని తెలిపారు. మహిళల క్రికెట్​ను  ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

మహిళల క్రికెట్ పట్ల మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​లో టీమ్ఇండియా మహిళలు తొలి పింక్ బాల్ టెస్టు ఆడబోతున్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నా” అని జై షా ట్వీట్ చేశారు.

ఏడేళ్ల తర్వాత ఇంగ్లాండ్​లో టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత మహిళా జట్టు సిద్ధమైంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో పాల్గొననుంది. తర్వాత టీ20, వన్డే సిరీస్​లూ జరగనున్నాయి. ఇంకా షెడ్యూల్​ ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ మధ్యలో ఈ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరసారిగా ఆసీస్​తో 2006లో టెస్టు మ్యాచ్ ఆడారు టీమ్ఇండియా మహిళలు.

 Extra Income in Lockdown: మీకు అదనపు ఆదాయం కావాలా..! ఇలా చేయండి..! ఇక డబ్బే.. డబ్బు..!

Attention taxpayers!: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..! కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను ప్రారంభించనున్న ఐటీ శాఖ

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొన్నవారికి అలర్ట్‌.. బైకులను వెనక్కి తీసుకుంటున్న కంపెనీ.. ఎందుకంటే!