IND vs WI: విండీస్‌ను ఢీకొనే టీమిండియా ఇదే.. సారథిగా రోహిత్.. తిరిగొచ్చిన చైనామన్ బౌలర్.. అశ్విన్‌కు నో ఛాన్స్

|

Jan 27, 2022 | 6:12 AM

Indian Team Squad Announcement: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు . రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టులోకి తిరిగి వచ్చాడు. రోహిత్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉండనున్నాడు.

IND vs WI: విండీస్‌ను ఢీకొనే టీమిండియా ఇదే.. సారథిగా రోహిత్.. తిరిగొచ్చిన చైనామన్ బౌలర్.. అశ్విన్‌కు నో ఛాన్స్
Rohit Sharma
Follow us on

India vs West Indies: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)ను ప్రకటించారు . రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టులోకి తిరిగి వచ్చాడు. రోహిత్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇది కాకుండా చైనామ్యాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మళ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చాడనేది పెద్ద వార్తగా నిలిచింది. అతడిని వన్డే జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ , దీపక్ హుడా తొలిసారిగా టీమ్ ఇండియాలో ఎంపికయ్యారు. హుడా వన్డే సిరీస్‌లో భాగంగా ఉండగా, రవి బిష్ణోయ్‌(Ravi Bishnoi)కు వన్డే, టీ20 సిరీస్‌ల జట్టులో చోటు దక్కింది. ఆర్ అశ్విన్ జట్టు నుంచి తప్పించారు.

దక్షిణాఫ్రికాలో పేలవమైన ప్రదర్శన..

దక్షిణాఫ్రికాలో పేలవ ప్రదర్శన కారణంగా భువనేశ్వర్ కుమార్ వన్డే జట్టు నుంచి తొలగించారు. అయితే టీ20 జట్టులో మాత్రం అవకాశం ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్‌ను కూడా వన్డే జట్టు నుంచి తప్పించారు. మరోవైపు శిఖర్ ధావన్ టీ20కి, ఇషాన్ కిషన్ వన్డే జట్టుకు దూరమయ్యారు. ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు తొలి వన్డేలో కేఎల్ రాహుల్ ఆడడం లేదు. రవీంద్ర జడేజాకు ఇంకా టీకాలు తీసుకోకపోవడంతో ఎంపిక చేయలేదు.

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20ల షెడ్యూల్..

భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. అదే సమయంలో కోల్‌కతాలో టీ20 సిరీస్ జరగాల్సి ఉంది.

కుల్దీప్ యాదవ్ తిరిగి వచ్చాడు..

గత కొన్ని సంవత్సరాలుగా కుల్దీప్ యాదవ్ వ్యక్తిగతంగా హెచ్చు తగ్గులతో మునిగిపోయాడు. ఈ ఆటగాడు టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. గతేడాది శ్రీలంకకు వెళ్లిన భారత బి టీమ్‌లో ఈ ఆటగాడికి అవకాశం లభించింది. అయితే కుల్దీప్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌లో మాత్రం చోటు దక్కలేదు. IPLలో కూడా, KKR కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ XI నుంచి తప్పించింది. గాయం కారణంగా అతను లీగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఈ ఆటగాడికి మళ్లీ అవకాశం వచ్చింది. కుల్దీప్ యాదవ్ వన్డే, టీ20 రికార్డు అద్భుతంగా ఉండడంతో మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఈ లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ 65 వన్డేల్లో 107 వికెట్లు పడగొట్టాడు. టీ20లోనూ కుల్దీప్ 23 మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు.

రవి బిష్ణోయ్‌పై విశ్వాసం..

21 ఏళ్ల లెగ్ స్పిన్ రవి బిష్ణోయ్‌కు తొలిసారిగా టీమిండియాలో అవకాశం దక్కింది. బిష్ణోయ్ ఇప్పటివరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల, బిష్ణోయ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులో చేర్చుకుంది. బిష్ణోయ్ 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

వన్డే జట్టు ఇలా..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రీతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.

టీ20 జట్టు ఇలా..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.

Also Read: IPL 2022: ఈ విదేశీ ఆటగాళ్లపై పోటీపడనున్న ఫ్రాంచైజీలు

Shikhar Dhawan: శిఖర్ ధావన్ చెంప చెళ్‌మనిపించిన తండ్రి !! వీడియో

Dwayne Bravo: గ్రౌండ్‌ లో పుష్ప స్టెప్ వేసిన బ్రావో !! వీడియో నెట్టింట వైరల్