IPL 2022: ఈ విదేశీ ఆటగాళ్లపై పోటీపడనున్న ఫ్రాంచైజీలు

ఆస్ట్రేలియన్ ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్, వెస్టిండీస్ ఆల్-రౌండర్ రొమారియో షెపర్డ్ తొలసారి IPL కాంట్రాక్టులను దక్కించుకుంటారని భావిస్తున్నారు.

గత సీజన్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ ఎంచుకోలేదు.

బెన్ మెక్‌డెర్మాట్  బీబీఎల్ ఈ సీజన్‌లో 153.86 స్ట్రైక్ రేట్ తో 577 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరపున 17 టీ20ఐ, 2 వన్డేలు ఆడాడు.

వేలం కోసం రూ. 75 లక్షల జాబితాలో వెస్టిండీస్‌ ప్లేయర్ షెపర్డ్ పేరు చేర్చారు. ఈ భారీ మెగా వేలంలో వెస్టిండీస్‌కు చెందిన 41 మంది ఆటగాళ్లలో షెపర్డ్ ఒకరు.

ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు ఉన్నాయి, వీటి కోసం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో భారీ వేలం నిర్వహించనున్నారు.