Video: బాల్య స్నేహితురాలితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌.. షాకిచ్చిన టీమిండియా ప్లేయర్..

Kuldeep Yadav Engagement With Vanshika: ఈ నిశ్చితార్థం తర్వాత, కుల్దీప్ యాదవ్ టీమిండియాలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనున్నాడు. జూన్ 20న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత కుల్దీప్, వంశికలు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

Video: బాల్య స్నేహితురాలితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌.. షాకిచ్చిన టీమిండియా ప్లేయర్..
Kuldeep Yadav engaged Vanshika

Updated on: Jun 04, 2025 | 9:27 PM

Kuldeep Yadav Engagement With Vanshika: భారత క్రికెట్ జట్టులో తన చైనామన్ స్పిన్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న కుల్దీప్ యాదవ్, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు, కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికతో లక్నోలో కొద్దిమంది బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగించగా, వారిద్దరి బంధం ఎంతో ప్రత్యేకమైనదని తెలుస్తుంది.

వంశిక – బాల్య స్నేహితురాలే జీవిత భాగస్వామిగా..

ఇవి కూడా చదవండి

వంశిక లక్నోలోని శ్యామ్ నగర్ నివాసి. ఆమె LICలో పనిచేస్తున్నట్లు సమాచారం. కుల్దీప్ యాదవ్, వంశికల స్నేహం చిన్నతనం నుంచే కొనసాగుతోంది. కాన్పూర్‌లో వీరిద్దరు ఒకరికొకరు బాగా తెలుసు. ఆ బాల్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇప్పుడు ఇద్దరూ జీవిత భాగస్వాములుగా మారడానికి సిద్ధమయ్యారు. కుల్దీప్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతాడు. కాబట్టి, ఈ నిశ్చితార్థం అందరికీ ఒక ఆశ్చర్యం కలిగించింది.

సన్నిహితుల సమక్షంలో..

లక్నోలోని ఒక వేదికలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక చాలా నిరాడంబరంగా, సన్నిహితుల సమక్షంలో జరిగింది. కుల్దీప్, వంశికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రికెటర్లు, ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి: ఇది గమనించారా.. ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్.. 3 ఫైనల్స్ ఆడినా, ట్రోఫీ లేకుండానే కెరీర్ క్లోజ్

ఆన్‌లైన్‌లో వైరల్ అయిన ఫొటోలు..

కుల్దీప్, వంశికలు తమ నిశ్చితార్థం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రాలలో ఇద్దరూ ఎంతో సంతోషంగా, అందంగా కనిపించారు. వంశిక ఆరంజ్ కలర్ లెహంగాలో మెరిసిపోగా, కుల్దీప్ ఐవరీ రంగు షేర్వానీలో ఆకట్టుకున్నాడు.

రాబోయే ఇంగ్లాండ్ పర్యటన, వివాహ ప్రణాళికలు..

ఈ నిశ్చితార్థం తర్వాత, కుల్దీప్ యాదవ్ టీమిండియాలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనున్నాడు. జూన్ 20న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తర్వాత కుల్దీప్, వంశికలు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: IPL 2025: హీరోలు కావాల్సినోళ్లు.. కట్‌చేస్తే.. విరాట్ కోహ్లీ ఫేమ్‌లో జీరోలుగా మిగిలిపోయిన నలుగురు..

కుల్దీప్ కెరీర్‌లో ఒక మైలురాయి..

వ్యక్తిగత జీవితంలో ఈ కొత్త అధ్యాయం కుల్దీప్ యాదవ్ కెరీర్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నారు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన కుల్దీప్, 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన కనబరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అతను అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు కీలక ఆటగాడిగా మారాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో కుల్దీప్ భాగం. తన నైపుణ్యాలతో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టగల కుల్దీప్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరపడటం అతని ఆటపై సానుకూల ప్రభావం చూపుతుందని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..