India vs Bangladesh, 2nd T20I: భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ వార్త రాసే సమయానికి 17 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.
కేవలం 2.6 ఓవర్లలోనే 2 వికెట్లు, 5.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన భారత్.. పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ఈ సమయంలో తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి, రింకూ సింగ్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి 41 పరుగుల వద్ద ఉన్న భారత్ స్కోర్‌ను 149 పరుగులకు చేర్చారు. ఈ సమయంలో నితీష్ రెడ్డి తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించాడు.
Maiden T20I Half-Century for Nitish Kumar Reddy 🔥🔥
Watch him hit two consecutive sixes off Rishad Hossain’s bowling!
Live – https://t.co/Otw9CpO67y…… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/jmq5Yt711n
— BCCI (@BCCI) October 9, 2024
34 బంతుల్లో 74 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి ఔటయ్యాడు. 14వ ఓవర్లో ముస్తాఫిజుర్ రెహమాన్ స్లో బాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 12వ ఓవర్లో తస్కిన్ అహ్మద్‌పై సింగిల్ తీసి తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతను 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది అతని కెరీర్‌లో మొదటి అర్ధ సెంచరీ. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అరంగేట్రం చేశాడు.
రింకూ సింగ్ 26 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 34 బంతుల్లో 74 పరుగులు చేసిన నితీష్ రెడ్డిని ముస్తాఫిజుర్ రెహమాన్ పెవిలియన్‌కు పంపాడు. రింకూతో కలిసి నితీష్ 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు, సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్ తలో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ ప్లేయింగ్-11లో ఒక మార్పు చేయగా, షోరిఫుల్ ఇస్లాం స్థానంలో తాంజిమ్ హసన్ షకీబ్‌కి అవకాశం లభించింది. భారత్ తన ప్లేయింగ్-11ని మార్చలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..